పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఘనుండు డుదియించ్చె[1] నాతనికిం గంజ్జదళేక్షణ రేకమాంబకుం
దనయులు పుట్టి రిద్ధగుణధాములు సోమనవెన్ననలు యశో
ధనులన నందు సోమయకుం దమ్ము ... ... పనాయకుండ్డు స
జ్ఞజన(రవి)జన్ముం డాతనికి, జం ... ... ... కసానికిన్.

2

(దీనిపిదప నీవైపునఁ గొన్నిపంక్తు లున్నవి. అవి సీసపద్యభాగములుగాఁ దోఁచుచున్నవి. పాదవిభాగము చేయుటకుఁ గూడ ననుకూలముగ లేవు గావున విడువంబడినవి. ఎఱ్ఱమనాయకుం డొకానొకపూండిలో తటాకము త్రవ్వించిన ట్లున్నది.)

రెండవవైపు

క.

కరనయనశశిధరిత్రీ
పరిగణనం బొంది శకనృపాలాబ్దంబు
ల్పరగంగ నక్షతదియయు
ధరణీసుతదినమునందు దాత్పర్య్యముతోను.

3


స్వస్తి

శ్రీమతు గొట్టిపఱ్తి ఎఱ్ఱమనాయకుండు శకవర్షములు 1122 గు నేంటి వైశాఖశుక్లత్రితియ్య భౌమవారమునాండు దనతల్లి....

(తరువాతిభాగము ఖిలమైనది.)

—————

55

శ. స. 1122

(ఈశాసనము గుంటూరుమండలమందు అమరావతిగ్రామమందు అమరేశ్వరస్వామియాలయము వెలుపల తూర్పుదిక్కున పాఁతియున్న యొకఱాతిపలకమీఁద నున్నది. South Indian Inscriptions Vol. VI. No. 215.)

శా.

శ్రీ రమ్యంబగు వారిజాసన ... ... షట్కర్మ్మధ
ర్మ్మారంభుం డిల నప్పనా... ... ద్యన్మూర్త్తిగా వానికిం

  1. డుదయించె