50
(ఇది గుంటూరుమండలమందు సిరిపురములో రామేశ్వరాలయమం దున్నయొకఱాతిమీఁది శాసనములోని భాగము. మిగిలిన భాగము చక్కఁగాఁ దెలియుట లేదు. Government Epigraphist's Collection No. 48 of 1909.)
మ. |
... ... ... ... ... ... ... ... .. ...మం
బరదుద్ధాబ్ధిసురాపగాంబురజతప్రఖ్యాతకీర్త్తిప్రభం
గర మొప్పను సహకా(ర)వల్లభు న్రిపౌఘశ్రేష్టు గోంక్గక్షితీ
శ్వరసూనును వెలనాంటిచోడి(జ)నపును సామాన్యమే పేక్గొ(౯నను).
| 1
|
సీ. |
రామనిధివ్యోమరాజవత్సరములు
వర్త్తిల్లంగా ఖరవత్సరమునం
బరగిన(యట్టి యీ)గిరిపశ్చిమంబులోం
బూండ్లు[1] వండ్రెం డ(పూ)ర్వ్వభా(తి)
శ్రీకరంబై యొప్పు సిరిపురంబున నుత్త
రాయణంబునయందు రమణతోడ
వఱలంగ్గ నెఱియన వరతనూజుం డగు
బొల్లన బాలేందుభూషణునకు
పరమభక్తిం దాండిపాలగోత్రుణ్డు మ
నోజనిభుండు గడుమహోత్సవముగ
మణ్డితంబుగా నఖణ్డదీపము పెట్టె
వారిజాప్తచంద్రతారకముగ.
| 2
|
- ↑ బూండులు