పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

శ. స. 1082

(ఈశాసనము గుంటూరుమండలములో బాపట్లగ్రామమందు శ్రీభావనారాయణస్వామిగుడి గోడమీఁద చెక్కఁబడియున్నది. ఇదియు 44వ సంఖ్య శాసనము నొక్కనివే. South Indian Inscriptions Vol. VI. No 184.)

ఉ.

శ్రీరమణీయ్య[1]వక్షుండు వశీకృతలోకుండు విప్రవంశని
స్తారణకారణుండు విలసద్గుణభూషణుం డిష్ట(జన)[2]
క్షారతుం డుత్తమోత్తముండు గౌశికగోత్రుండు గొమ్మశౌరి ధ
ర్మ్మోరుచరిత్రుం డప్పెరువంగూరిపురీశుండు ధన్యుం డు(న్నతిని).

1


ఉ.

ఆవసుధామరేశ్వరున కన్వయరత్న(ము కొ)మ్మమాంబకును
భూవినుతుండు విప్రకులభూషణుం డుద్భవమయ్యె (గొంక్క) ధా
త్రీవిభుసంద్ధివిగ్రహి (య)తిస్థిరచి(త్తుం డ)మాత్యరత్న మా
గోవిందన[3]వంశవర్ద్ధనుండు గోత్ర విత్రుండు ధాత్రుం డిత్రయిని.

2


చ.

గురునిభుం డయ్యమాత్యనిధి (గొ)య్దనపెగ్గడ కంబుజాస్య యం
బురుహదళాక్షి గేతమకు బుత్రుండు గౌశికగోత్రుం డంబుజో
దరపదభక్తియుక్తుండు ప్రతాపది(నే)శుండు గొంక్కధారుణీ
శ్వరునకు సన్ధివిగ్రహి ప్రసన్నమనస్కుండు గొమ్మం డిమ్మహిని.

3


క.

రమణీయ్య[4]ధనదపురవర
మమరంగ నిజరాజధాని యయ్యుండ్డంగ నక[5]
రము నెల్లూరును లోపుగం
గ్రమ మొనరంగ్గ నేలె బాహుగర్వ్వము వెలయను.

4
  1. రమణీయ
  2. (బంధు) అని యుండనోపు.
  3. ఇచట ఛందోభంగమైనది. గోవిధ అనికాని గోవన అనికాని యుండనోపు.
  4. రమణీయ
  5. ఇక్కడ ఛందోభంగము గలిగినది. సరియైనపాఠము చింత్యము.