పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

శ. స. 1081

(ఇది గుంటూరుమండలములో కంచెర్లగ్రామమందు భీమేశ్వరాలయమునందలి ఱాతిస్తంభముమీఁది శాసనము.)

క.

శ్రీయువతీప్రియునాభీ
తోయజమునం బుట్టె బ్రహ్మ దురితేతరుం డా
తోయజభవునకు శాలం
కాయన(ఋషి) పుట్టె ధర్మ్మకర్మ్మఠుం డ(నంగా)ను.

1


సీ.

తద్గోత్రమునం బుట్టె ధన్యుండు వెగ్గడ
            దే(చి)దేచికిం బురంధ్రీలలామ
కామవాంబకుం బుట్టెం గాంతియుక్తుండు గోం
            కం డతనికి నాచమ కతిముదమునం
బుట్టె మేడండు జగత్ఫూజ్యుం డాతనికి దా
            మనకు జన్మించ్చిరి మహితకీర్త్తి
ధనుండు నల్లండు గోంక్కండును దే(చి)యును వీరి
            లోన నల్లయ బుధలోకనుతుండు
చోడకన్నరవిభుచేత సూర్య్యవంశ
వర్య్యుచే మంత్రిపదవియు వసుమతీశ
చిహ్నములుం బెక్కు వ్రిత్తులుం జిరతరముగం
బడసి పురుషార్త్త[1]గౌరవప్ర(వు)డుం డగుచు[2].

2


చ.

ఒఱపగు శాకహాయనము లుర్వ్వి గజాంబరచంద్రసంఖ్యగా
వఱలిన కన్యసంక్రమణవాసరనాథుదినంబునందుం గ(౦)

  1. పురుషార్త్థ
  2. ప్రౌఢుం డగుచు