42
(ఇది గుంటూరుమండలములో సిరిపురముగ్రామమందు రామేశ్వరాలయమున నొకఱాతిమీఁద నున్నశాసనము చివరభాగము. శాసనకాలమును దెలుపు మొదటిభాగము పోయినది. Government Epigraphist's Collection No. 49 of 1909.)
చ. |
ఇల వెలనాంట్టిచోడినృపు నిచ్చినదత్తము దీని కన్యథా
దలంచిన దుర్వ్వినీతుండు మ(దం)బ్బఱి దుర్ద్దశం జెంద్ది వంద్దియా
కులుండై[1] కాలుప్రోలు సొరం గొట్టిన విడ్మఱ గాన కంద్ద తా
నెలకొని రౌరవాంబుధి మునింగి యడంగు ననేకకాలములు.
| 1
|
చ. |
చెఱువులు నూఱు వన్నస లచింత్యము సత్రము లగ్రహారములు
గుఱుకొని లక్షగంగు లొకకోటిశివాలయములు సహస్రకం
బఱువదివేలు వావులు సతాధ్వరములు[2] పదివేలు బ్రహ్మముం
బెఱిచిన(య)౦తవాతకము సిద్ధము దీనికి హింస సేసినన్.
| 2
|
క. |
తనదత్త మన్యదత్తం
బనంజనదు స్వదత్త మెట్లట్ల[3] రక్షిం
పనియతం డఱువదివేలేం
డ్లనవరత మమేధ్యక్రిమి[4] యై జనియించ్చును.
| 3
|
- ↑ కులుండయి
- ↑ బావులు శతాధ్వరములు
- ↑ మెట్టులట్టుల
- ↑ మవేధ్యము క్రిమి