పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెత్తించ్చెం బరమేశు నిందుశేఖరుం డమ
            రేశ్వరదేవర కిల ప్రొ(ధూ?) ప
కొలము ప్రీతితోడ నివేద్య మిన(ని
            ఘా?) ని (చిమా?) నులకర్త్థ మిచ్చె[1]
సరసిజాసనవంశశేఖరుడు పురుష
కారగుప్తుండు వంశవిస్తారకుండు
గరణయెల్లండు సుచరితాభరణుం డిటు
భాసురంబుగా ధర్మ్మువు సేసి వెలసె.

13

(పైశాసనపుఁబంక్తులనడుమ నీక్రిందిపద్యము చెక్కఁబడియున్నది. ఇటీవల చెక్కఁబడినట్లు కనఁబడుచున్నది.)

ఉ.

దిట్టకవి ప్రసిద్ధిగల తిప్పనసత్కవి సార్వ్వభౌముం డౌ
యెట్టనినం[2] గవిత్వమున నెవ్వరు వానికి నీడుగామిం దాం
గట్టినగోచి దక్క నొకకాని యు డాంప్పక యర్త్తి[3]కోటికిం
బెట్టుట బాపురే బిరుదు పెట్టిన వానిక చెల్లు నుర్వ్వరను.

14

—————

  1. ఈపాద మనన్వయముగా నున్నది.
  2. నెట్టనిన
  3. యర్త్థి