పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వ్రిత్తం॥ వానికి జన్నమాంబకును వంశకరుం డుదియించె[1] బ్రహ్మతే
జోనిధి బాంధవాబ్జవనశూర్య్యుండు[2] గొమ్మయపూర్న్నచంద్రబిం
బానన సర్వ్వలక్షణగుణాన్విత సూరమ(౦ బె)౦డ్లి యయ్యె సం
త్తానవివృద్ధిపొంటె నుచితస్థితిం జారుచరిత్ర నిల్వంగాను.

4


చ.

జననుతకీర్త్తి గొమ్మయకు సామజగామిని సూరమాంబకును
మనుచరితుఁడు సత్పురుషమాన్యుండు భూసురవంశశేఖరుం
డన నుదియించెం[3] బెన్నయ గుణాగ్రణి వారిజపత్రలోలలో
చన యగుప్రోలమాంబ విలసన్మతిం బెండ్లి[4] యయ్యెం బ్రీతితోను.

5


ఉ.

లాలితసర్వ్వలక్షణవిలాససమ్రిద్ధికి నాస్పదంబు సొం
జాలి పతివ్రతావిమలచారుచరిత్రకు నాలవాలమై
శీలమునను సమానమగు శీతకు[5] ధాత్రికి నద్రిజాతకుం
బ్రోలమ నన్యకామినులు వోలుదురే గుణగౌరవంబునను.

6


ఉ.

ప్రీతివిశుద్ధసత్వు ణ్డగుపెన్నయకును దలితాంబుజాస్య భూ
జాతసమాన వ్రోలమకు సత్కవిసజ్జనబన్ధుమిత్రసం
ఘాత(సు)పోషకల్పతరుకల్పుణ్డనం బ్రభవించ్చె నెల్ల ణ్డు
ద్యోతసరత్స[6]మాగమవిధుద్యుతి సర్వ్వజనానురాగు ణ్డై.

7


మ.

పదుమూణ్డేణ్డ్ల[7]నా ణ్డమాత్యపదవిం బ్రాపించ్చి తత్సంప్పదా
స్పదుణ్డై సత్కవిబంధుమిత్రజనసంపత్కారి యై సాధుస
మ్మదశుద్ధప్రతిభాప్రపంచ్చితలసన్మార్గ్గస్థితిని సంతతా
భ్యుదయుణ్డై విలసిల్లె నెల్లణ్డు జగత్పూర్ణ్నాచ్ఛకీర్త్తిచ్ఛవిని.

8
  1. కరుం డుదయించె
  2. సూర్య్యుండు
  3. నుదయించెం
  4. బెండిలి
  5. సీతకు
  6. శరత్స
  7. పదుమూణ్డేణ్డుల