పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శకవర్షములు 1076 అగు నేంటి శ్రావణశుద్దైకాదశి యు
గురువారము(న) శ్రీధనదవ్రోలిచోడనారాయణదేవరకుం బడిహారి
ముత్తియనాయకుని కూ(౦)తుఱు కొమ్మమ దనకు ధర్మ్మువుగా (న)ఖం
డదీపమునకుం బెట్టిన బిరుదుగద్యలు 1(6) వీనిం జేకొని కండ్ల బ్రహ్మ
నకొడ్కు (ముత్తయ) దనపుత్రానుపౌత్రికము నిత్యమానెండు నెయి
ఆచంద్రార్కము నడపంగలవాండు.

—————

38

శ. స. 1076

(ఈశాసనము కృష్ణామండలములో పెదకళ్ళేపల్లిగ్రామమందు శ్రీనాగేశ్వరస్వామిగుడిలో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 88)

స్వస్తి.


సీ.

శ్రీసోమవంశవిశేషకుణ్డగు బల్ల
            భూపాత్మజుణ్డు దిలీపనిభుణ్డు
చాలుక్యభీమభూపాలు ణ్డన్నరపతి
            కబ్బలదేవికి నగ్రసుతుణ్డు
బల్లాధినాథుణ్డు భరథ[1]భగీరథ
            ప్రస్తుతచారిత్రం బరగుచున్న
యాతనివల్లభి సీతాసమాన సో
            మలదేవి సుభ[2](గు)ణలలిత కడలు

  1. భరత
  2. శుభ