పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సురుచిరంబుగ నాత్మసుత ఎఱుకమకును
            ... ... ... ...సుభముగాని(చ్చె)[1]


యిద్దివియకుం చెరియబోయిని కొడ్కు గాటయబోయినివసము
నం బెట్టిన యినుపఎడ్లు 55। వీనిం జేకొని నిత్యమానెండు నెయ్యి
యాచంద్రార్క్కముం బోయంగ్గలవాండు.

—————

30

శ.స. 1072

(ఈశాసనము గుఁటూరుమండలములో కొణిదెనగ్రామమందు చెన్నకేశవస్వామి యాలయములో నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 644.)

సీ.

దినకరకులుండైన త్రిభువనమల్లండు
            కమ్మనాండును గుండికఱ్ఱు మొట్ట
వాడియుం జేకొని రూఢిగా నేలంగ్గం
            గొట్టియదొన యనుపట్టనమున
నభినవరైవతకాద్రిణి[2] నొప్పిన
            గిరిమింది[3]విహగేంద్రకేతనునకు
ధనదవంశేశుండు పెనుగొండభైరవ
            నాయకుకాపయనందనుండు
ఘనుండు బయ్యనసెట్టి సంక్రాంతితిథిని
మిత్తమున నేత్రశైలవియత్తలేందు

  1. ఈపాద మసంపూర్తిగా నున్నది.
  2. రైవతకాద్రిని
  3. మింది = మీఁది. ఈరూప మిప్పుడును పడమటిదేశమందు వాడుకలో నున్నది.