|
నికి జనియించ్చె గుండెన మనీషిజనప్రణు(తు)౦డు వానికిం
జకితకురంగలోచనకుం జందనగంధికి గుప్పమాంబకును.
| 1
|
క. |
ధీరుండు గశ్యపగోత్రో
ద్ధారుండు గుండిమడవిభుం డుదారుండు మదనా
కారుండు గవలియ యన్నండు
గారవమునం బుట్టి వంశకరుం డై పేర్మ్మిని.
| 2
|
స్వస్తి |
శకవర్షంబులు 1071 గు నేంటి ఉత్తరాయనసం
క్రాంతినిమిత్తమున — ఇత్యాది.
|
|
29
(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడగ్రామమందు ఇంద్రకీలపర్వతము నడుగున ఖిల మయిన యొకమండపములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 731.)
తరువోజ. |
కరగిరివియదింద్దుగణనమై పరగం
గాశకునేండ్లు అక్షత్రి[1]తీయయు మి
హిరవాసరమున బాలేందుధరుండ
యిన బెజవాడ మల్లీశ్వరగౌరి
వల్లభునకుం గొ(ను)[2] వరవీరచోడ
వల్లభుండు అఖండవర్త్తి[3] దీపంబు
|
|
- ↑ నేండు లక్షత్రి
- ↑ ఈపాదమందు ప్రాస చెడినది. "వరునకుం గాంగను” అని యున్న సరిపోవును.
- ↑ ఇచటఁ గవి విసంధి చేసినాఁడు.