పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శీతకరాస్య బూరమకు సింన్ధురవైరిబలుండ్డు రాజమా
న్ధాతుండు పుట్టె భీమండు వదాన్యుండు ధన్యుండు పుణ్యమూర్త్తియై.

4


చ.

................................
......................దీధితిరేఖవరేణ్యపుణ్యదో
హల అనం[1] బెంపుగన్న ఎఱియాంబ్బకు[2] నుద్భవమయ్యె భారతీ
నిలయుం డనంగ్గం బండ్డధరణీపతి సర్వ్వకలాప్రవీణుం డై.

5


చ.

తలంపు సదర్త్థభావమునం దద్గతసూక్తులం గూడ వర్న్నన(లు)
గొలసు[3] గొనంగ్గ వ్రావడ్లు[4] గోరినభంగ్గిక వచ్చి ముట్టం గో
మలగతి దేపిమార్గ్గములు మట్టుపడం గ్గటనంబ్బు లొప్ప నా
ద్యులక్రియం జెప్పనేర్చ్చె నృపధూర్జ్జటి భీమయపండ్డం డిమ్మహిని.

6


మ.

స్వరతర్క్కాంబరచంద్ద్రసంఖ్యం జను తచ్చాకాబ్దచైత్రామలే
తరపంచ్చాదశి సౌరివాసరసముద్యన్మేషసంక్రాంత్తి సు
స్థిరతం బ్బొలుచు[5]మయూరవాహనునకుం జ్జేంబ్రోలం బెట్టించ్చె భా
స్వరదీపం బ్బతిభక్తిం బండ్డన్రిపుం డాచంద్ద్రార్క్కతారంబుగాను.

7


స్వస్తి

శకవర్షంబులు 1067 గు నేంట్టి చైత్రబహుల పం
చ్చాదశియు శనైశ్చరవారమున శ్రీకుమారస్వామిదేవరకు మహామ
ణ్డలేశ్వర పండ్డయ దమతండ్రి భీమరాజునకు ధర్మ్మార్థముగా నఖండ్డ
దీపమున కిచ్చిన ఎడ్లు 55 వీనిం జేకొని నల్లంగాటయబోయునికొడు
కు కొండబోయుణ్డు దనపుత్రానుపౌత్రిక మాచంద్రార్క్కము మహా
సేనమున నిత్యమానెండు నేయు వోయంగ్గలవాణ్డు శ్రీశ్రీశ్రీ.

—————

  1. యనం
  2. యెఱియాంబకు
  3. గొలుసు
  4. ౦బ్రావడులు
  5. బొల్చు