పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అతిసయ[1] మైన ఛత్రమును నద్దము నుల్లము నాలవట్టమును
జితమగుం జామరావలియుం జిందచయంబులుం గేతనంబులు
న్నతులమహోక్షవాహనున క(ద్రి)జ(నా)తున కింద్దుమైవులికా[2]
యతమణి మన్మమండండు (జ)యాస్పదుం డొప్పంగ నిచ్చె భక్తితోను.

9


నొంచినిపాడు గోరుకొన్న కొల్చు దేవరకు వీస వి(డువం) గలవారు.

————

16

శ. స. 1062

(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు మూలస్థానేశ్వరాజయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. మొదట 5 సంస్కృతపద్యములును బిదపఁ దెనుఁగుపద్యములు నున్నవి. సంస్కృతభాగములో “కరరసవియ దిందుమితే శకసమనిచయే” యని యున్నది - South Indian Inscriptions Vol. IV. No. 675.)

శా.

శ్రీవేంగీవసుధాంగనాతిలక మై శిష్టక్షమాదేవ(బృ)౦
దావాసం బగువానరంబుపతి యుద్యత్కీత్త్కి యజ్ఞత్రయ
వ్యావర్ద్ధిష్ణుమహిష్ఠుతప్రకటపున్యారంభుం డై[3] యొప్పె స
ద్భావిం[4] బోతనసోమయాజి నిచితబ్రహ్మాండతేజుం డిలజ్.

1


చ.

అతనికి నాత్మజుండు సుజనాగ్రణి దొడ్డపనాయకుండు ద
త్సుతుం డనవద్యకీర్త్తి మతిసూర్య్యుండు వానితనూజుం డుజ్వల
వ్రతుం డగుమంత్రి శ్రీధరుండు వానికి సూరపసానికిని బృహ
స్పతినిభుం డుద్భవించె బుధబంధునిధానుండు గంటం డిమ్మహిని.

2
  1. అతిశయ
  2. నాథున కింద్దుమౌలి కా
  3. మహిష్ఠతాప్రకటపుణ్యారంభుం డై
  4. సద్భావముతో- అని కవియభిప్రాయ మైయుండును.