పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

వరశకవత్సరంబు లుడువల్లభతర్క్కనభేందుసంఖ్యగాం
బరగి వెలుంగు మాఘసితపంచ్చమియుం గవివాసరమునం[1]
దురుతరకీర్త్తిలోలుం డన నొప్పిన బుద్దంద్రిపాలు[2]కాంత్త దా
నరు దగుచుండ నాదిండ్ల అందు ప్రసిద్ధిగ[3] శూలపాణికిని.

4


క.

వ్యాలేభచర్మ్మధారికి
మూలస్థానంబునాదిమూర్త్తికి శ్రీకా
పాలికి మృడునకు హరునకు
నీలగ్రీవునకు నీశునికి నుమపతికిని.

5


క.

స్తిరమతి[4] గడియమదేవులు
దిరమైయుండంగ నఖండదీపము నిల్పెం
దరతర మొన్నతముగ నీ[5]
ఖరకరజలజారితారకముగ ధరిత్రిని.

6


యీదీపంబున కిచ్చిన గొఱియలు 55। వీనిం జేకొని మన్య
గొ(మ్మ)యకొడ్కు ప్రోలబోయుండు ఆచంద్రార్క్కముం బుత్రానుపౌత్రి
కము నిత్యమానెండునెయి దివియకుం బోయంగలవాండు.

7


చ.

చిరముగ దేవదేవునకు శ్రీబలిదేవరదేవి శంఖులా[6]
భరణము గీతవాద్యములుం (బ)ట్టున చీరలు ధూపఘంటయుం
దిరమగుఘంట వరియలము[7] దీపనికాయము ధేనుసంఘము
న్నరు(దు)గ మనుమ[8]మండండు ప్రియం బొనరను రచియించ్చె భక్తితోను.

8
  1. వాసరంబునం
  2. బుద్దనృపాలు
  3. నాదిడలయందుం బ్రసిద్ధిగ
  4. స్థిరమతి
  5. మున్నతముగ నా
  6. సంకులా
  7. వర్యలము
  8. మన్మ