|
గౌడసతీనేత్రకాలాంజనుని సంగ
భామాకపోలాప్తపత్రరచను
నేపాలకామినీనీరంధ్రకుచహారు
నంధ్రీతనూకుంకుమాంగరాగు
రమణతో నాదిదానుల రాసి కెక్కి
దీనజనముల యడఱెల్లం దీర్చ్చుచు(న్న)
యనఘచారిత్రు మారపండనిన తగిలి
పొగడ విందుము నెల్లభూభుజులసభల.
| 1
|
శా. |
పెంచ్చెం జుట్టల నెల్ల(౦) బేర్మ్మి వెలయ న్బెట్టించె సత్రంబు గ
ట్టించ్చె న్భక్తి శివాలయంబు లిలం బ్రౌఢింద్దాల్చి యొప్పంగ్గ౦) గ్రొ
ప్పించ్చెం బూర్న్నతటాకములు జలధిగంభీరంబు గాంచె న్నిధులు[1]
నించ్చె న్మారయపండ(౦)డర్త్థి భవనానీకంబుల(౦)గ్గీర్త్యుణ్డై.
| 2
|
స్వస్తి॥ |
శ్రీమత్త్రిభువనచక్రవర్త్తి శ్రీవిక్రమచోడదేవరవిజయ
రాజ్యసంవత్సరంబుల పదియేడగు నేండు శకవర్షంబులు 1054గు
నేంట్టి వైశాఖశుద్ధతృతీయ్యయు గురువారమునాణ్డు— (ఇత్యాది)
|
|
12
(ఈశాసనము కృష్ణామండలములో గన్నవరముతాలూకా ఎనమలకుదురుగ్రామమందు శ్రీ కేశవస్వామిగుడియెదుట నొకరాతిస్తంభము మీఁద చెక్కఁబడియున్నది. ఈగుడిలోనే వేఱొకశాసనములో నీభీమరాజే 1054 సంవత్సరమున— శాకే యుగబాణఖేందుగణితే— మఱియొకధర్మము చేసినట్లున్నది. South Indian Inscriptions Vol. VI, No. 100.)
శా. |
శ్రీకాంత్తాప్రియు లిష్టసిష్ట[2]జనతాశీర్వ్వర్ధ్ధనులు ధా(ర్మ్మి)కు
ల్నాకీశోన్నతభోగభాగులు జనానందప్రదు ల్విద్విషా
|
|
- ↑ "గంభీరంబుగాం బెన్నిధుల్" అని యుండవలయును.
- ↑ శిష్ట