చ. | (ఉరుశకవత్స)రంబులు రసోదధివాయుపథేందుసంఖ్యగా | 3 |
————
9
శ.స.1050
(ఈపద్యము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందలి శంకరేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద నున్నది. ఆఱాతిమీఁదనే గుండిమడ అన్నమంత్రి చేసినధర్మములను గుఱించిన పెద్దశాసనము కలదు. ఈపద్య మాయన్నమంత్రికే సంబంధించిన దయినట్లు కనఁబడుచున్నది. అన్నమంత్రితండ్రి గుండమంత్రి త్రిభువనమల్లదేవునికొడుకు నన్నిచోడుని మంత్రి యయిన ట్లున్నది. ఈనన్నిచోడుఁడే శ. స.1002లో కొణిదెనగ్రామమందలి త్రిభువనమల్లికార్జునమహాదేవరకు కొణిదెనకుఁ దూర్పున నున్న డేఁగఱమూఁడి యిచ్చినట్లు డేఁగఱమూఁడిలో నొకశాసన మున్నది. మఱియు నీపద్యమే శంకరేశ్వరస్వామియాలయములో వేఱొక ఱాతిమీఁదఁ గూడ నున్నది. ఆఱాతిమీఁద నీపద్యముక్రింద "కమ్మనాటిస్థలము అడ్డసుంకఱులు” శ. స. 1067లో శంకరేశ్వరస్వామికి ధర్మము చేసిన ట్లొకశాసన మున్నది. ఈరెంటిలిపియు నొకరీతిగానే యున్నది. దీనినంతను బట్టి చూడ నీపద్యము శ. స. 1050 ప్రాంతమున చెక్కఁబడిన ట్లూహింపవచ్చును.Government Epigraphist's Collections No. 175 of 1899.)
చ. | గడుసరిలోభి యర్త్థ మది గన్నపుంగానికి బంద్దికానికిం | |
- ↑ నీ యని యుండనోపు. మంత్రియన్న అనునది సంబోధన మగును.