పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

శ. స. 820 ప్రాంతము.

(ఈశాసనము బెజవాడగ్రామమందు మల్లేశ్వరస్వామియాలయములో నొకఱాతిమీఁద మూఁడుప్రక్కలను చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. XV)

మధ్యాక్కర.

స్వస్తి నృపాంకుశాత్యన్తవత్సల సత్యత్రిణేత్ర
విస్తరశ్రీయుద్ధమల్లు ణ్డనవద్యవిఖ్యాతకీర్త్తి
ప్రస్తుతరాజాశ్రయుణ్డు ద్రిభువనాభరనుణ్డు సకల
వస్తుసమేతుణ్డు రాజసల్కిభూవల్లభుణ్డర్త్తిన్.[1]

1


పరగంగ బెజవాడ గొమరస్వామికి[2] భక్తుణ్డై గుడియు
నిరుపమమతి నృపధాము ణ్డెత్తించ్చె నెగి దీర్చ్చె మఠంబు[3]
గొరగల్గా కొరు[4] లిన్దు విడిసి బృన్దంబు గొని యుణ్డువారు
... రిగాక యబ్బారణాసి వ్రచ్చిన పాపంబు గొణ్డ్ఱు.

2


నెలయంగ నియ్యొట్టు ఱస్సి మలినురై విడిసిన వ్రోల[5]
గలతానపతులును రాజు పట్టంబు గట్టినపతియు
నలియం బయ్వారల[6] వెల్వఱించిన నశ్వమేధంబు
ఫలం బు[7]పేక్షించిన లింగం బఱిసిన[8] పాపంబు దమకు

3
  1. వల్లభుణ్డర్థి
  2. గోమరసామికి
  3. మఠము
  4. ఇక్కడ “గొరగల్గాక” అనుచో లకారము తేల్చి పలుకవలయును.
  5. విడిసినం బ్రోలం
  6. నలియం బైవారల
  7. ఫలము
  8. మఱిసిన