పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/16

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పేర కౌలు వ్రాయవలసిందని ప్రభుత్వం వారు అంటున్నారు. ఇలా చెయ్యడంలోగల ఉద్దేశం ఇది. ముందు ఈ భూముల ఖామందులు ప్రభుత్వం వారని ఋజువు చెయ్యడం; ఆ తర్వాత వాటిని నెమ్మదిగా యూదీయులకు అమ్మి వెయ్యడం.

"జనాభాలో నూటికి ఒకరైనా హీబ్రూ (యూదీయుల భాష) మాట్లాడరు. అయినప్పటికీ దాన్ని ఒక రాజభాషగా అంగీకరించారు".

"వెల్లువలా వలసవచ్చి పడుతున్న యూదీయుల వల్ల, జనభారం హెచ్చిపోతున్నది. వలస వచ్చిన యూదు కూలీల కారణంగా ఆరబ్బు కూలీలకూడా పడిపోతున్నది. ఆరబ్బు కూలీ చేసే పనిలో యూదు జాతి కూలీ సగం పనైనా చెయ్యలేడు. కాని, అతడికే ఎక్కువ కూలి ముట్టచెబుతూ ఉన్నారు".

"గవర్నమెంటు కంట్రాక్టుల్ని చాలావరకు యూదీయులకే (వారు ఆరబ్బుల కంటే ఎక్కువ మొత్తానికి టెండరు పెట్టినా) ఇస్తున్నారు".

దాదాపు పదిహేను సంవత్సరాలనాడు ఆరబ్బు డెలిగేషన్ వారు చిత్రించిన ఈ స్థితికీ, నేటి స్థితికీ, భేదం ఏమైనా ఉన్నదంటే, అది నాటి స్థితికంటే నేటిది మరింత ఘోరంగా ఉండడమే! ఇందుకు నిదర్శనంగా జాఫాలోని ఆరబ్ లేబర్ ఫెడరేషన్​కు కొంతకాలం కార్యదర్శిగా వున్న జార్జ్ మన్​సూర్ ఇటీవల ప్రకటించిన ఒక వ్యాసాన్ని చూపించవచ్చును; ఆ వ్యాసంలోని కొన్ని భాగాలు ఇవి:

"దేశం ఎంత జనాభాలను భరించగలదు అనే విషయాన్ని గురించి విచారించవలసిందిగా ప్రభుత్వం వారు నియోగించిన సింప్సన్, ఫ్రెంచ్ మొదలైన వారేగాక, ఇదే పనికి జియోనిస్టు (యూదు) సంఘం వారు స్వయంగా నియమించిన కాంప్​బెల్ కూడా 1930లోనే యూదీయులు చిత్తం వచ్చినట్టు వలస రావడం వల్ల దేశానికి నష్టం కలిగిందని ప్రకటించారు. అయినప్పటికీ వారి సిఫార్సుల్ని ప్రభుత్వంవారు తోసివేశారు. ఇలా చెయ్యడానికిగల కారణాలు ఏమిటో వారికే తెలియాలి. అరబ్బులు ఇంకా నిద్రావస్థలో ఉండగానే, వలసవల్ల తమ సంఘాన్ని మెజారిటీ సంఘంగా చేసుకుందామనే యెత్తుతో యూదీయులు పెట్టిన ఒత్తిడికి ప్రభుత్వం వారు తలవొగ్గారు కాబోలు!

"1920-1930 సంవత్సరాల మధ్య సగటున సాలుకు 10,000 మంది చొప్పున యూదీయులు పాలస్తీనాకు వలస వచ్చారు. ఇంతమంది వలస రావడమే తగదని చెప్పినప్పటికీ, 1933-1935 సంవత్సరాల మధ్య 136,000 మందికి పైగా యూదీయులు ప్రభుత్వం వారి అంగీకారంతో వలసకు వచ్చారు. వీరుగాక దాదాపు 40,0000 మంది రహస్యంగా దేశంలో ప్రవేశించారు. 1919లో 50,000 మాత్రమే ఉన్న యూదు జనాభా 1935 నాటికి 4,20,000 వరకు ఎలా పెరిగిందో దీనివల్ల తెలుస్తుంది.

"గ్రామవాసులు చాలవరకు ఆరబ్బులు. పట్టణ వాసులలో అధిక సంఖ్యాకులు యూదు జాతివారు. అంచేత పట్టణ వాసులైన యూదీయలకు లాభకరంగా, పల్లెవ మీద ఎక్కువ