పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/96

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాఱె సర్వసిద్ధిపద మేది ధరణీవ
రాహమునకు నోడి రాచకదుపు.

41


చ.

[1]అమమత కాస్పదంబు, వినయంబునకుం గుదు, రుబ్బులేనినె
య్యమునకు నాలవాలము, మహాగుణపంక్తికి జన్మభూమి, దా
నమునకు [2]నాదరం, బరిరణక్రియ కుగ్రనికేతనంబు, నా
నమరుఁ జళుక్యవిశ్వమనుజాధిపుచిత్త [3]మమత్తవృత్తియై.

42

ఏకతరవళి నిరూపణము

క.

[4]మ ర వ ల ఱ లేకతరవళు, లరయఁగఁ దమతమక కవులయనుమతి వళులై
పరఁగుఁ, బదాంతముకారము, [5]పొరిఁబొందిన పు ఫు బు భు ము లు పొసఁగినచోటన్.

43


ఆ.

మధురవచనుఁ డార్యమాననీయాగ్రణి
[6]రసికవరుఁడు రాజరాజనిభుఁడు
[7]వరుస యెఱిఁగి సుకవివరులకు నిచ్చిన
లచ్చి విశ్వవిభునిలాగు మెచ్చు.

44


ఆ.

అజ్జు లాని యీగి ఱావడి సభలోన
ఱేసి పోరి లోప ఱిచ్చఁ బొఱసి
ఱెన్న మడుగుపుడమిఱేండ్ర నేల నుతింప
మనకు విశ్వనాథుఁ డొనరియుండ.

45

ముకారవళి నిరూపణము

తే.

పుడమి విశ్వవిభునిభుజమునకుఁ దొడవు
ఫుల్లపద్మాలయవితీర్ణమునకు బోటి
బుధులు విద్యావివేచనమునకు సాక్షి
భువనములు కీర్తికి నివాసములు దలంప.

46

ప్రాదివళి నిరూపణము

క.

ప్ర ప రాప స మను సు ప్ర, త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాఙ్వ్య త్యవ ప
ర్యుపసర్గవింశతికి వళు, లు పరస్పరవర్ణయుక్తి నుభయముఁ జెల్లున్.

47
ప్ర - పరా - అప - సమ్ - అను - ను - ప్రతి - అపి - నిర్ - దుర్ - అధి - ని - ఉప - అభి - ఉత్ - అఙ్ - వి- అతి - అవ - పరి: — ఇవి యిరువదియు నుపసర్గలు; ఇందు అప్యాజ్ అను నిరూపణ మప్రసిద్ధము.
శా.

ప్రారంభించు నశేషధర్మముల సంపాదించు సత్కీర్తులన్,
బ్రారబ్ధంబులు నిర్వహించు ఫలపర్యంతంబుగా నెప్పుడున్,
బ్రారబ్ధప్రతిలబ్ధసంపదలచే రాగిల్లు నుల్లాసి యై
యీ రా జంచు నుతింతు రార్యు లిల విశ్వేశావనీవల్లభున్.

48
  1. క.గ.చ. అమమత కాశ్రయంబు
  2. క.గ.చ. నాకరం బతిరణక్రియ
  3. క.గ.చ. అమత్తవృత్తమై
  4. క. మరవఱల లేక, గ.చ. మరవఱలు లేక
  5. క.గ.చ. పొరినూదిన దూతిచనిన పుఫుబుభుములచోన్ 'లోన్ క.'
  6. చ. రసికవిభుఁడు
  7. క.గ.చ. వరుస యెఱుఁగు