పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/93

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధీశ్రీస్త్రీ మన మగణము, విశ్రుత, మధిదైవతంబు విశ్వంభర; ని
త్యశ్రీల నొసఁగు మగణ, ప్రశ్రయముఖకవిత [1]చెప్పఁ బని దనుఁ దలఁపన్.

11


క.

జగతివరాహా యనఁగా, యగణం బుదయించె నుదక మధిదైవత మై,
యగణప్రయోగములయెడఁ, [2]దగిలించున్ సిరులుఁ దన్నుఁ దలఁపున నిలుపన్.

12


తే.

[3]బ్రమిసి కాగుహా రనునట్టి పలుకు రగణ
మయ్యె; నధిదైవతము వహ్ని యయ్యెఁ గానఁ,
గవితముఖమున రగణంబు గట్టునపుడు
వహ్నిఁ దలఁపఁగఁ బగఱకు వచ్చుఁ జావు.

13


క.

గతికై ఫణి వసుధాసని, మతిఁ దలంచిన సగణ మయ్యె; మారుత [4]మధిదై
వత మండ్రు; సగణముఖ మగు, కృతి పగఱకు మగుడులేని కీ డొనరించున్.

14


క.

సాతేక్వ దనుడుఁ దగణము, జాతం బై శూన్య మగుడు, [5]జద లధిదైవం
బై తనరెఁ; దగణముఖకృతి, శ్రీతుం డగునృపుని నైన హీనుం జేయున్.

15


ఆ.

తనరఁ [6]బింగళుఁడు కదాస జనన్ జగ
ణము జనించెఁ, దదధినాథుఁ డినుఁడు;
తొలుతఁ [7]గృతిని జెప్పఁ దణఁగుచో నర్కుని
దలఁప నరికి రోగతతులు వొడము.

16


క.

ఖగపతి కింవద భన నది, భగణం; బుడురాజు తదధిపతి; భగణాద్యం
బుగను గృతి చెప్పునప్పుడు, మృగాంకుఁ దలపంగ నగు సమీహితకాంతుల్.

17


క.

[8]సహస నని పలుక నగణం, బహుతం బగుఁ, దదధిదైవ మగుఁ బ్రాణుఁడు; త
ద్విహిరస్మృతి నాయువు గడు, నిహితం బగు నగణముఖవినిర్మాణములన్.

18


క.

గురులఘువులు గలములు; లఘు
[9]గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్;
గురులఘువులు త్రితయము లై
మురిసిన నవి మగణ నగణములు నాఁ బరఁగున్.

19


ఆ.

మగణరచన కాదిమధ్యాంతలఘువులు
గలిగె నేని య ర త గణము లయ్యె;
నగణరచన మొదల నడుమను గడ గురు
వుండెనేని భ జ స లొప్పు మిగులు.

20


క.

[10]లోవంక వ్రాయ గురు వగు; [11]నేవంకయు లేనివ్రాత [12]యెసఁగును లఘు వై;
[13]జైవాతృకరేఖాయుత, భావజశరనిభము లండ్రు ప్రాజ్ఞులు మఱియున్.

21


క.

గురువు లగు నొంటిసున్నల, నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్
బొరసినవియు దీర్ఘములు, ని, తరములు లఘువులు గణములు తత్త్రితయంబుల్.

22


క.

ఇందుఁడు గాంతి [14]వపుః ప్రభఁ, గందర్పుఁడు సప్తసప్తి ఘనరుచి ననఁ, జె
న్నందినయవి గురువులు చె, న్నొందిన నిడుపులును నట్ల యున్నవి లఘువుల్.

23
  1. క.గ.చ. చెప్పు పనితను
  2. క.గ.చ. తగులించున్
  3. క.గ.చ. భ్రమశికాగుహా
  4. క.గ.చ. అధిదైవత మయ్యె
  5. క.చ. జలనిధి దైవంబు
  6. గ.చ. పింగళుఁడు సదాసజ్ నాన్
  7. క.గ.చ. కృతికిఁ జెప్ప
  8. క.గ.చ. నహస నని పలుక
  9. క.గ.చ. గురుగురులఘువులును నెన్ని
  10. క.గ.చ. లోవంక వ్రాయి
  11. క.గ.చ. ఏవంకయు లేని వ్రాయి
  12. క. ఎసఁగు లఘువునై
  13. క.గ.చ. జైవాతృకరేఖాయత
  14. గ.చ. వపుః ప్రథ