పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసమర్థము

క.

జనపతి వనధర పరివృత, యనఁ జను[1]ధర నేలె ననఁగ నసమర్థ మగున్
[2]వనధికి నీవనధరపద, మొనరించుట శబ్దసంపదూనత యగుటన్.

78

అనర్థకము

క.

నలి నొప్పెఁ బురుషుఁ డొగిఁ గడు, నలవడియెం బడఁతి యన ననర్థక మయ్యెన్
[3]నలి ననియెడునది యొగినన్, పలుకును బూరణము లంధ్రభాషకు నగుటన్.

79

అపసంస్కృతము

క.

స్పరిశన మతివకు సీతకు, దరిశనము మనోహరంబు దరుణికి ననఁగా
ధర నపసంస్కృత మగుఁ ద, ద్గురుత్వ మాద్యక్షరములఁ గూడక యునికిన్.

80

నేయార్థము

క.

వరునిపయిఁ గూర్మి వనితకు నిరవగ్రహ [4]మెపుడు ననిన నేయార్థ మగున్
నిరవగ్రహశబ్దార్థము, తీరముగ నేతవ్యసరణిఁ దెలియుటచేతన్.

81

సందిగ్ధము

క.

అవనీభృత్కటకం బు, త్సవపద మెల్లపుడు ననిన సందిగ్ధార్థం
బవిరళ మగు నగతట మా, నవపతిపుర సంశయంబు నరులు కొదవుటన్.

82

అప్రయోజనసంశ్లిష్టము

తే.

[5]అప్రయోజనసంశ్లిష్ట మగు సమీర, ణాశనారాతికృతకేతనాగ్రజన్మ
శత్రుకటముల నిల్తురు శత్రు లనిన, నేతదర్థంబు గిరులకు నేఁగి రనుట.

83

క్లిష్టగూఢార్థము

తే.

క్షతజకంజేక్షణలు క్షామగల్లకటలు, ఘనవిదగ్ధాత్మికలుఁ [6]బురికాంతఁ లనఁగఁ
గ్లిష్టగూఢార్థ మనఁ జనుఁ గ్లేశసరణిఁ, దత్తవర్థంబు నెఱిఁగెడి తలఁపుచేత.

84

అప్రతీతికము

క.

క్షితి బాడబులకు మన్యు, [7]స్థితి యుచిత మనంగ నప్రతీతిక మగు వి
శ్రుత బాడబమన్యువులకు, వితతార్థము లెందుఁ బెక్కువిధము లగుటచేన్.

85

అన్యార్థము

క.

ఆదట నింద్రుని జగదా, హ్లాదంబునఁ జంద్రుఁ డనిన నన్యార్థము సం
పాదిల్లు నియతనామ, ప్రాదుర్భావముల నెన్నఁబడకుండుటచేన్.

86

అవిమృష్టవిధేయాంశము

క.

ఉవిదకు మొలనూలు మనో, భవురెండవనారివోలెఁ బరఁగె ననంగా
నవిమృష్టవిధేయాంశం, బవు నతనికి రెండునారు లడరక యునికిన్.

87
  1. క.గ.చ. ధర యేలె ననఁగ
  2. క.గ.చ. వనధికినై వనధరపదము
  3. క.గ.చ. వలవనియెడ నలి నొగినను
  4. చ. ఎపుడుననఁగ
  5. క.గ.చ. అప్రయోజకసంక్లిష్ట
  6. క.గ.చ. పురికాంత లనిన
  7. క.గ.చ. స్థితి యుచితమె యనంగను