పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిగమపధనులు

క.

నీసరి పని నీసరి ధని, నీసరిమాధారిగరిమ నీసరిగా రీ
నీసరిగా నిగమాగమ, [1]గోసారులునుం జళుక్యకులవిశ్వేశా.

63

గోమూత్రికాబంధము

తే.

వర్ణములు నాల్గుపంక్తుల వరుస వ్రాసి
మూలలం దోలి గోమూత్రలీలఁ జదువ
నుక్తపద్యంబు దా నగు చుండెనేని
దనకు గోమూత్రికాఖ్యబంధంబు నాఁగ.

64

మాలిని

వివిధ నయ విధిజ్ఞున్ విద్ధవీరారిగర్వున్
భువి ధనద విధిజ్ఞున్ బుద్ధసారాభిగమ్యున్
[2]బ్రవరగుణగరిష్ఠున్ భాతవిశ్వేశుఁ గాంతున్
ధవళగుణగరిష్ఠున్ [3]ధాత విశ్వేశుఁ గాంచున్.

65

చక్రబంధము

తే.

[4]వలయనవకంబు [5]నాఱురేఖలు లిఖించి
యందు శార్దూలవిక్రీడితాక్షరములు
వెట్టి నడుచుట్లఁ గవి కృతి పేళ్లు రెండు
చక్రబంధంబునకు నిడి చదువవలయు.

66


శా.

చిత్తోపేతవికస్వరోత్తమగుణున్ శ్రీలంపటున్ సత్క్రియా
విత్తోద్దండును విశ్వభూరమణు నుర్వీకృత్యసత్కృత్యదున్
విత్తాయక్షమతావిధిజ్ఞు మహితున్ [6]వీతిక్రమాతిప్రియా
యత్తుం జూచి నినున్ విశేషవిదుఁగా యాచింపుదున్ దుర్జయా.

67

కుండలిబంధము

క.

[7]ఎనుబది పదములుగాఁ, బెనఁ గొని యుపదేశమునఁ దెలియఁ గుండలిబంధం
బనఁజనుఁ దత్పదములఁ జ, క్కనివ్రాలిడి వరుసఁ జదువఁ గబ్బం బమరున్.

68


మ.

సరతోద్యత్కరవాలభైరవు విరాజద్రాజతేజస్కుఁ జి
ద్గతసత్యస్వరపూతకార్యు వరదున్ దత్కోలఖేలద్ద్వజ
ప్రతిభీత[8]ద్విడధీశనుత్యచరణున్ [9]భావార్థసారజ్ఞు [10]ను
చ్ఛ్రితసారస్వతభూతిసారవిషయున్ జింతింతు సంతుష్టితోన్.

69

ఖడ్గబంధము

క.

తరతరమ పూసనుండియుఁ, [11]బరుజులు దట్టాడి మధ్యపద్ధతి ధారా
పరివృతి నుపదేశక్రమ, పరిచితిఁ బఠియింప ఖడ్గబంధం బయ్యెన్.

70
  1. క.గ.చ. గోసారులు నై చళుక్య
  2. క.గ.చ. ప్రవణగుణగరిష్టున్
  3. గ. భావవిశ్వేశుఁ గాంచున్
  4. క. వలయదశకంబు
  5. గ.చ. ఆఱుఱేకులు లిఖించి
  6. గ.చ. వీతిక్రమాతిక్రియా
  7. క.గ.చ. ఎనబది పదములుగా
  8. క.గ.చ. ద్విషధీతనుత్య
  9. క.గ.చ. భావార్ధసార్థజ్ఞు
  10. క. తచ్ఛ్రితసారత్వవిభూతి, గ.చ. నంచితసారత్వవిభూతి
  11. క. పురుజులదట్టాడి, గ.చ. పురుజులందట్టిడి