పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/78

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిమధ్యయమకము

క.

పరపుగఁ [1]బద్మాకర మనఁ, [2]బరికల్పిత మగుచుఁ బరఁగుఁ బద్మాకర మై
ధర నెగడు విశ్వభూవరు, వరసదనము బుధులపాలి వైభవపదమై.

38

మధ్యాంత్యయమకము

క.

పరగండభైరవుని యరి, వరులును ముక్తాతపత్త్రవైభవు లెపుడున్
[3]పరగండభైరవుని కవి, వరులును ముక్తాతపత్త్రవైభవు లెపుడున్.

39

ఆద్యంత్యయమకము

క.

హరిదంబరవిక్రము డనఁ బరఁగుం జళుక్యవిశ్వపార్థివుఁ డనుచున్
బొరిఁ బొగడుదు రరినృపతులు, హరిదంబరవిక్రమప్రయత్నయశస్కున్.

40

సర్వయమకము

క.

వనవర్గనివసదహితుఁడు, వనవర్గప్రీతదివిజవల్లభుఁడు సకృ
ద్వనవర్గశివవయస్యుఁడు, [4]వనవర్గార్కుండు విశ్వవసుధేశుఁ డిలన్.

41

పాదత్రయయమకము

శా.

శస్త్రోదంచితుఁ డైన యవ్విభు విపక్షశ్రేణికి న్విభ్రమ
త్స్వస్త్రీతస్ఫుటకంకణధ్వని రణస్థానంబున న్విభ్రమ
త్స్వస్ స్త్రీతస్ఫుటకంకణధ్వని మరుత్సౌధంబుల న్విభ్రమ
త్స్వస్త్రీతస్ఫుటకంకణధ్వని సరిత్సంగంబులం జేకుఱున్.

42

ద్వితీయోపమానగోపనము

సీ.

విద్యావిభూతి వివేకసంపన్నత వాణీశ వాణీశవైభవంబు
[5]శౌచప్రతాపాతిసత్త్వసమగ్రత శిఖిమిత్ర శిఖిమిత్ర శీలనంబు
గాంభీర్యభోగరంగద్రత్నసామగ్రి జలధీంద్ర జలధీంద్ర విలసనంబు
విక్రమసౌందర్యవిపులదర్పోన్నతి బలభద్ర [6]బలభద్రబంధురంబు


తే.

దాల్చి వెలుఁగొందు విష్ణువర్ధనకులాబ్ధి
చంద్రుతో విశ్వభూపాలచంద్రుతోడ
చంద్రధరపాదభక్తినిస్తంద్రుతోడ
నితరనృపునకుఁ దుల్యత్వ మెట్లు గల్గు.

43

నిరోష్ఠ్యము

క.

పంచమవర్గాక్షరములు, వంచించి హితోచితార్థవంతంబులు గా
వించిన కబ్బము వీనుల, కంచిత మై యది నిరోష్ఠ్య మన నొప్పారున్.

44[7]


శా.

చాళుక్యక్షితినాథునూర్జితయశస్సంక్రాంతిచేఁ దూలు లో
కాలోకాద్రిఁ దనర్చుచీఁకటులు, కైలాసోల్లసద్దీధితుల్

  1. క.గ.చ. పద్మాకరమున
  2. క.గ.చ. పరికల్పిత యగుచు
  3. క.గ.చ. కరవాలభైరవుని కవి
  4. గ.చ. వనవర్గాంకుండు
  5. చ. శౌచప్రతాపాది
  6. క.గ.చ. బలభద్రబంధురతయు
  7. ఈపద్యము తరువాత గ.చ ప్రతులలో నీకందపద్య మధికముగాఁ గన్పట్టుచున్నది.
    క. శరణాగతజనరక్షక
       ధరణీరథ(ధర) శీతశైలఁ(దళితశైల)తనయేశ లస
       ద్ధరిణాంక కళాధర శం
       కర శాంత దయాసనాథ కాశీనాథా!