పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/69

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

[1]సురుచిరరత్నకీలితము సూతము బన్న సరంబు సూపు, క
ప్పురపుఁగరండముం [2]దెఱచి పుచ్చు వెలుంగున, నంచు విశ్వభూ
వరుఁ డొకయింతిఁ బల్కుటయు వచ్చిన[3]నెచ్చెలు లంతటంతటన్
[4]సురుచిరసాలభంజికల[5]చొక్కపుజోటులువోలెఁ జూడఁగన్.

72

సమాహితము

తే.

కడఁకతో మున్ను దొరకన్నకర్జమునకు, సాధనము [6]దైవవశమునఁ జాగెనేని
యది సమాహిత మని చెప్ప నతిశయిల్లుఁ, గార్యకర్తకు నానందకరణ మగుచు.

73


ఉ.

మానిని విశ్వనాథు[7]పదమంజరులున్ దనఫాలపట్టమున్
మానుగఁ గూర్తు నంచు నభిమానము మానఁ దలంచుచోట న
మ్మానవనాథుఁ డచ్చ మగుమక్కువ నచ్చటి కేఁగుదెంచి త
త్సూనశరాసనాస్త్రములు చూఱకొనుం గరుణాసమేతుఁడై.

74

ఉదాత్తము

క.

[8]అతులైశ్వర్యాశ్రయముల, వితతత్వ ముదాత్త మనఁగ విశ్రుత మగు [9]నం
చితసంపద్భహుళము నూ, ర్జితపదమును నగుచుఁ గార్యరీతులయందున్.

75


శా.

వంశం బీశ్వరమాళి [10]మండనమహో౽వార్యంబు, నిర్ణిద్రని
స్త్రింశం బింద్రపురస్థి[11]తాహితనుతిశ్రీకంబు, చక్రాచల
ప్రాంశుధ్వాంతనిహంత్రి కీర్తి, వినమద్రాజన్యకోటీరర
త్నాంశూదంచిత మంఘ్రియుగ్మము, చళుక్యస్వామి కెల్లప్పుడున్.

76

అపహ్నుతి

క.

కలయర్థనిరసనంబున, నలవడునన్యప్రకార మగునర్థముచే
వెలయు నపహ్నుతి యనఁగాఁ, బలికెడు వెరవులను బోక్కుపాకము లగుచున్.

77


మ.

ఘనమేఘం బది వాజిగాఁ దతఁడు నిక్కం బింద్రుఁ డారోహకుం
డనరా దంగమరీచి గా దది తటిద్వ్యాపార ముద్యత్థుర
ధ్వని గా దంబుదఘోషణం బది ధరన్ దక్కొంట నీసొంపు లే
దని [12]భావింతురు విశ్వభూవిభుని యశ్వారోహణక్రీడలన్.

78

క్లిష్టము

క.

[13]ఏకార్ధోక్తం బయ్యు [14]న, నేకార్ధము చిలుకుచుండు నెయ్యది యతివో
లోకమున శ్లిష్ట మనఁగాఁ, బైకొనఁదగుఁ బదవిచిత్రకల్పనవిధులన్.

79


మ.

[15]మరుదుత్ఖేలదశోకపల్లవయు సమ్యక్పత్త్రసందోహయున్
భరితామోదయు జృంభమాణసుమనోభద్రప్రదేశంబు నై
యరుదై యొప్పెడు [16]విశ్వభూపవిపులోద్యావళిం జూడఁ ద
త్పురియుం బోలెఁ దనర్చె నింతి మహిళాపున్నాగపూగంబులన్.

80
  1. క. సురుచిరరత్నకీలములు, గ.చ. సురుచిరరత్నకీలనము
  2. క.గ.చ. తెఱచిపుచ్చుపలుంగుల
  3. క.గ.చ. నెచ్చెలు లంతనంతటన్
  4. క.గ.చ. సురిగిరిసాలభంజికల
  5. క.గ.చ. చొక్కపుబోఁటులవోలె
  6. క.గ.చ. దైవవశమున సాగెనేని
  7. క. పదమంజరులన్
  8. క.గ.చ. అతులైశ్వర్యాశయముల
  9. గ.చ. సంచితసంపద్బహుళము
  10. క.గ.చ. మండనమహావర్యంబు
  11. క.గ.చ. అహితనుతశ్రీకంబు
  12. గ.చ. భాషింతురు విశ్వభూవిభుని
  13. క.గ.చ. ఏకార్థంబే యయ్యు
  14. క.గ.చ. ననేకార్థముఁ బలుకుచుండు
  15. క.గ.చ. మరుదుద్వేలదశోక
  16. గ.చ. విశ్వభూపతిపురోద్యానావళి