పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

గజభుజగాదులదెసఁ గల, గుజిబిజికిం గాక వీడుకొన్నదివోలెన్
భజియించి నిలిచె వలపటి, భుజమున విశ్వేశ్వరునకు భూసతి ప్రీతిన్.

46

హేతువు

క.

కారకమును గ్రియయును న, ర్థారంభంబునకు బీజ మగు నేమిట [1]నిం
పార నది హేతు వనఁ జను, భూరిప్రతిభావిశేషములఁ బె క్కరయన్.

47


శా.

సంపల్లంపటమందహాసములు సంజాతానుకంపాకళా
సంపన్నంబులు సాదరప్రియనయస్థానంబు [2]లిద్ధక్రియా
సంపూర్ణంబులు నాఁగ విశ్వధరణీశశ్రీకటాక్షాంశువుల్
సొంపుం బెంపును నింపు సేయు నెపుడున్ సూరీశ్వరశ్రేణికిన్.

48

ఉదారము

క.

ఆయాసోపార్థితము న, దేయమును మనోహరాభిధేయమ్మును శ్ర
ద్ధేయము నగుధన మొసఁగును, సాయ ముదారంబు నాఁగ నవనిం బర్వున్.

49


శా.

విశ్వే[3]శావనిపాలపాలకునిచే విత్తాఢ్యులున్ సత్యభా
[4]గశ్వారూఢులు నంబరాభరణచిహ్నాటోపులుం గామినీ
శశ్వత్సౌఖ్యసమగ్రమానసులు నై [5]చారుస్థితిన్ సత్కవుల్
నైశ్వర్యోన్నతిఁ బేర్తు రెప్పుడు తదుదార్యం బవార్యంబుగన్.

50

సూక్షము

క.

ఆకారేంగితకృతచే, ష్టాకల్పితసూక్ష్మగతుల [6]సంలక్షిత మై
[7]కైకొనఁ దగు నంతర్గత, పాకాల్పత సూక్ష్మ మనఁగఁ బరఁగుం గృతులన్.

51


ఉ.

శ్రీల జళుక్యనాథుఁ డొనరించెను నేఁ డని గారవించుచో,
బాలకు లేఁతన వ్వధరపల్లవకాంతి నలంకరించె, వై
మాలపుసిగ్గు చూపులకు మాటుగఁ దోఁచెఁ, గుచోత్తరీయమున్
గే లొడికంబు సేసెఁ, దిలకించిన నెచ్చెలు లట్టిచేష్టలన్.

52

లవము

తే.

సూక్ష్మభావంబు విడువనిసొబగుతోడ
భావమునఁ దోఁచువస్తుగోపనముపేరు
లవము నాఁ జను; [8]దేశకల్పనముతోడి
విమతినిందలు లవమున విస్తరిల్లు.

53


చ.

సుదతి యొకర్తు విశ్వవిభుఁ జూచి వడిం బులకించి లజ్జ లోఁ
[9]గదిసిన నేర్పుతోడఁ జెలికత్తెల కిట్లను నింత యొప్పునే

  1. క. ఇంపారునది
  2. క.గ.చ. ఇష్టక్రియాసంపూర్ణంబులు
  3. క.గ.చ. అవనిపాల పాలితులచే
  4. గ.చ. అశ్వారూఢులు నుంబరాభరణ
  5. క.గ. చాటుస్థితిన్ సత్కవుల్
  6. క.గ. సంవీక్షితమై
  7. క.గ. చేకొనఁదగు
  8. క.గ.చ. లేశకల్పనముతోడి
  9. క.గ. గదిసిననోర్పుతోడ