పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

చాళుక్యక్షితిపాలుఁ డొప్పు ననిలో శక్రుండునుంబోలె, దం
భోళిక్రీడఁ దనర్చు ఖడ్గ, మసుహృద్భూపాలకశ్రేణులుం
గూలుం గొండలభంగి, నంబరనటత్కోలధ్వజంబుం బొరిం
గ్రాలుం గాలవలాహకాకృతి, సురవ్రాతంబు గీర్తింపఁగన్.

8


క.

సతతప్రతిభోదయసం, గతి నుపమానోపమేయకల్పనములయం
దతిచతురకవులతలఁపులఁ, [1]బ్రతిపాద్యోపమలు పెక్కుభంగు లెఱుంగన్.

9


క.

లింగంబుల వచనంబుల, భంగులు హీనాధికతలపాటియు వీడ్పా
టుం గదిరిన నుపమకు [2]నిం, పుం గలుగం జేయం నండ్రు బుధు లుచితోక్తిన్.

10


తే.

అరుగుచున్నాఁడు పేడివాఁ డతివపోలెఁ,
బలుకుచున్నది పురుషునిపగిది నింతి,
ప్రాణములు నాకు నీతఁ. డుపార్జితార్థ
మిన్నివిద్యలు ననినను నెసఁగు నుపమ.

11


క.

దేవా, నీ చందంబున, దేవేంద్రుం డొప్పు నంట దినకరుగతి ను
ర్వీవరుఁడు తేజమున సం, భావితుఁడన నుపమ చెల్లు [3]బ్రౌఢప్రియ మై.

12


క.

నిపుణుల[4]చెవి కెఱబఱ మగు, నుపములు నొకకొన్ని గలవ యొక్కొకచోటన్
క్షపవోలె జముఁడు కృష్ణుఁడు, విపినంబునుబోలె [5]వనధి విఫలం బనఁగన్.

13


ఆ.

హంసివోలెఁ [6]జంద్రుఁ డవగాతుఁడు, నభంబు
కొలఁకులట్లు సిడము, కుక్కవోలె
నించు బంటు పతికి, నినుఁబోలె ఖద్యోత,
మనెడు [7]నుపమ లసహసనకరములు.

14


సీ.

సంకాశ నీకాశ సన్నిధ ప్రతిరూప తుల్య ప్రకాశాభ తులితములును
ప్రత్యనీక ప్రతిపక్ష సమాన ప్రతిద్వంద్వ నిభ సజాతీయములును
సదృశ సదృ క్సమ సంవాది సప్రభ ప్రతిబింబజ కోపమా ప్రఖ్యములును
[8]సహలక్షణ ప్రతిచ్ఛంద విరోధి సదృక్ష సవర్ణ సపక్షములును


ఆ.

నుపమితానువాది యుత సరూప ప్రతి
నిధులు ననఁగఁ బెక్కువిధములైన
శబ్దములును నట్టి స[9]త్క్రియాపదములుఁ
బొలుచుచోటఁ జెప్పఁ బొసఁగు నండ్రు.

15


క.

[10]దొరయు గెడ జోడు పోలిక, సరి సంగడి యుద్ది యీడు [11]సాటి పగిది నా
గరణి యనఁ జాడ్పు చందం, బొరసు [12]పరుసు నాఁగ నుపమ కొప్పుం జెప్పన్.

16

రూపకము

క.

ఉపమానంబునకును న, య్యుపమేయంబునకు రూపయోజన మేకో
ల్లపిత మయి వెలుఁగు నెచ్చటఁ, [13]బ్రపంచితము రూపకంబు [14]బహువిధలీలన్.

17
  1. క.గ.చ. ప్రతిపాద్యోపములు
  2. గ. ఇంపుం గదురంగఁజేయు
  3. క.గ.చ. ప్రౌఢప్రియయై
  4. క. చెవి కెరపడమగు, గ. ఎడపరమగు, చ. ఎరసరమగు
  5. మనము విపులం బనఁగన్
  6. గ. చంద్రుఁ డరరాతుఁడు, చ. చంద్రుఁ డరదాతుఁడు
  7. క. ఉపమలపహసంకరములు, గ.చ. ఉపమలపహసాకరములు
  8. తద్వ దేకార్థ సాంతత్య సాధర్మ్యాను రూపకాభేదనిరూపణములు—పా.
  9. క.గ.చ. క్రియాపదములఁ బోల్చుచోట
  10. క.గ.చ. దొరసుగెడ
  11. క.గ.చ. లాగరిదియైన
  12. క.గ.చ. పరసు నాఁగ ను
  13. క.గ.చ. ప్రపటుక మది రూపకంబు
  14. క.గ.చ. బహువిధము లిలన్