పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నద్భుతము రౌద్రవీరభయానకములు
నమరు బీభత్సరసము [1]నోజమునఁ జెప్ప.

98


క.

సకలరసములుఁ బ్రసాద, ప్రకటితములు [2]దక్కియున్న ప్రాణము లెల్లన్
సుకవుల కుచితనియోజ్యము, లకలంకత నెఱిఁగి యొనర నమరింప నగున్.

99


క.

ఇప్పగిది సులక్షణముల, విప్పగుకమనీయకావ్యవితతులు గైకో
నెప్పుడు నీచిత్తము నన, చొప్పడు శీతాంశువంశచూడారత్నా!

100


మ.

[3]మనుమోపేంద్రతనూజ సూరిజనతామందారభూమీజ భూ
జనరక్షాచతురత్రివర్గహృదయాసన్నోల్లసద్భర్త దు
ర్జనశిక్షాచణయుక్తదండ రిపురాజన్యాబ్జవేదండ చి
జ్జనితాశేషకళాభిరామ సమరస్థాణు[4]ప్రకారక్రమా!

101


క.

[5]నందకపాణి పరాక్రమ, నందిమహాకాళతుల్యనవ[6]శైవకళా
నందోదయపద జగదభి, నందితసత్కీర్తిశోభనస్థిరమూర్తీ!

102


మాలిని.

చతురగుణగరిష్ఠా సర్వవిద్యావరిష్ఠా
శ్రుతివిహితచరిత్రా [7]శూరసైన్యాళిజైత్రా
ధృతవిభవజయంతా ధీరవన్యావసంతా
వితతధృతినగేంద్రా విశ్వభూపాలచంద్రా.

103

గద్యము
ఇది శ్రీమదుమారణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధబుధవిధేయ
విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన కావ్యాలంకారచూడామణి
యను నలంకారశాస్త్రంబునం ద్రివిధకావ్యచాటుప్రబంధలక్షణ
వృత్తిరీతిప్రముఖనానావిధవిశేషసముద్దేశం బన్నది
చతుర్థోల్లాసము.

—————

  1. క. నోజమును జెప్ప
  2. క.గ.చ. చిక్కియున్నప్రాణములు
  3. క.గ.చ. మనుభూపేంద్ర
  4. క.గ.చ. ప్రకామప్రమా
  5. చ. నందకహేతి
  6. చ. శైవకథా
  7. క.గ.చ. శూరసైన్యాతిజైత్రా