పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రీతుల లక్షణోదాహరణములు

వైదర్భి

ఆ.

ప్రాణదశకయుక్తి నల్పఘోషముల [1]వ, ర్గద్వితీయబహుత గలిగి ద్విత్రి
పదసమాస యైనఁ బరఁగు వైదర్భి స, మాసరహిత యైన మధుర యండ్రు.

90


చ.

భుజమున విశ్వభూవరుఁడు భూభరముం దగఁ దాల్చెఁ దాల్చినం
గజభుజగేంద్రులున్ గుధరకచ్ఛపఘోణులుఁ గామితక్రియా
భజనమునం జరింతు రని ప్రస్తుతులం బ్రసరించుచున్న [2]యా
ద్విజయజనంబులం ద్రిదశతృప్తి సమాప్తి వహించు నద్దివిన్.

91

గౌడి

క.

ఘటితసమాసోద్భటపద, పటలయు నోజస్సుకాంతిభరితయు ఘోష
స్ఫుటవర్ణయు నిబిడా[3]ర్థో, త్కటయును నా గౌడరీతి కల్పితకృతులన్.

92


శా.

శుభ్రాదభ్రపరిభ్రమత్పటుయశోజ్యోత్స్నా[4]సరిత్సారితా
తిభ్రష్టాధితమస్సమూహు లగుధాత్రీభర్తలం బోరిలో
విభ్రాజిల్లు[5]చళుక్యవిశ్వవిభుదోర్విక్రాంతి [6]పెం పొంది తా
నభ్రద్వీపవతీతరంగములలో నాడించుఁ [7]గ్రీడాగతిన్.

93

పాంచాలి

క.

పంచషపదకసమస్తత, జం దన్మాధుర్యకాంతిసంచరదోజ
స్పంచితసుకుమారతలను, మిం చగుఁ బాంచాలరీతి మృదులాకృతి యై.

94


మ.

చతురోదారచళుక్యనాథకరశిక్షాజాతరేఖాసుధా
లతలం గ్రాలెడుచారుసాయకనటీలాస్యాంగహారాదులన్
బ్రతిగా నిచ్చటఁ జూచి తత్పరిచితిన్ బ్రాపించు [8]శూరారు ల
శ్రుత[9]రంభాపరినృత్యకృత్యముల నచ్చోఁ జూతు రచ్చంబుగన్.

95

లాటి

తే.

ఏకదుక్తత్రిరీతిసమేత యగుచు
నల్పఘోషాక్షరములచే నతిశయిల్లి
తనరు సంయుక్తవర్ణముల్ [10]తఱుచు లేక
వెలసెనేనియు లాటికావృత్తి యండ్రు.

96


మ.

అనిశంబుం గరవాలభైరవునిపాదారాధనం బొప్పఁ జే
సినవారుఁ ద్రిదశాంగనాదయికు లై జీవింతు రిచ్చోటఁ జే
యనివారుం ద్రిదశాంగనాదయితు లై జీవింతు రచ్చోట నం
చు నిరూపింతురు విశ్వనాథబిరుదస్తుత్యప్రభావం బిలన్.

97


తే.

తనరు శృంగారహాస్యశాంతములుఁ గృపయుఁ
[11]దనరు మాధుర్యగుణమునఁ దగును జెప్ప

  1. గ.చ. వర్గతృతీయబహుత
  2. క.గ.చ. యద్ద్విజయజనంబులన్
  3. క.గ.చ. ఉత్కటయును నై
  4. చ. సముత్సారితాతిభ్రష్టారి
  5. గ. చళుక్యవిశ్వపతి
  6. క.గ.చ. పెం పెట్టిదో
  7. క.గ. క్రీడాగతుల్
  8. గ.చ. శూరాదులశ్రుత
  9. క. రంభాకృతనృత్తనృత్యముల, గ.చ. రంభాకృతనృత్యకృత్యముల
  10. క.గ.చ. తఱుచు గాక
  11. క.గ.చ. పొసఁగ మాధుర్యమునఁ జెప్పుట గుణంబు