పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంత్యచాతుర్థికోత్కళికాఖ్య చూడఁ
బడి చతుర్థియఁ బోలెఁ జూపట్టవలయు.

18


క.

ఓజఃపదబహుళము వి, భ్రాజితపటుగౌడరీతిబంధురమును ని
చ్ఛాజాతరసవిభావవి, రాజితమును గా నుదాహరణ దగుఁ జెప్పన్.

19


క.

[1]నాయకవిభవమునకుఁ గవి, నాయకచతురతకు భాజనం బగుపద్యం
బాయితము సేసి యిడఁ దగు, నాయతిగాఁ దుదలయం దుదాహరణలకున్.

20

సద్దళి

క.

సంబుద్ధి విడిచి మును గల, సంబంధం బెడలకుండ సప్తవిభక్త్యా
డంబర మడరించిన నొడి, కం బగు సద్దళి యనంగఁ గవులకుఁ జెప్పన్.

21

సద్దళివిద్దళి

తే.

[2]సరివిభక్తుల సంబుద్ధిసహిత గాఁగఁ
చెప్ప నొప్పారుఁ బద్దళి [3]సిద్ద మగుచు,
ముక్తసంబుద్ధి విషమవిభక్తికలిత
యైనకృతి పేరు విద్దళి యండ్రు బుధులు.

22

కల్యాణి ఉత్ఫుల్లకము

క.

కేవలకలికాసంగతిఁ, గావించినకృతికిఁ బేరు కళ్యాణి యగున్
వావిరి [4]నుత్ఫుల్లక మది, యావల నుత్కళికతోన యదికిన యేనిన్.

23


తే.

గ్రంథబాహుళ్యభీరుత్వ[5]కథన మిదియు,
ధర నుదాహరణాదిభేదములు పెక్కు,
[6]తెలియుఁ డొండెడ, మఱికొన్ని తేటపఱుతుఁ
[7]బటుపదార్థాప్తిఁ జాటుప్రబంధములను.

24

బిరుదములు

క.

బిరు శబ్దంబు విరోధో, త్కరము మహారాష్ట్రభాషఁ [8]దత్ప్రదవిధులన్
[9]బిరుదము లనఁ జను వానిన, ధర బిరుదావళి యొనర్పఁ దగు నండ్రు బుధుల్.

25


చ.

అతులకులక్రమానతము లై భుజవిక్రమసంభవంబు లై
ప్రతిపదసార్థకంబు లయి పార్థివకర్ణకఠోరకంబు లై
[10]వితరణశబ్దపూర్వపృథివీవరచిహ్నము లై తనర్చు ను
ద్యతబిరుదాళిచేత [11]బిరుదార్థము చెప్పుట యొప్పు నెప్పుడున్.

26


క.

వినయ భుజవిక్రమక్రమ, ఘనవితరణ రణవిహార కరు ణాదికళా
జననస్థలు లగుగుణములఁ, బెనుపొందఁగఁ జెప్పవలయు బిరుదావళికిన్.

27


క.

సముచిత[12]తాళదళమ్ములు, సమధికపటుగౌడరీతి సందర్భములున్
సుమనో[13]భాషం బొలుపుగ, నమరింపుఁడు కవులు ప్రాకృతాదులనైనన్.

28
  1. క. నాయకవిభవ మలరుఁ, గ.చ. నాయకవిభవములకుఁ
  2. క. సతవిభక్తుల
  3. క.గ.చ. సిద్ద యగుచు
  4. క.గ.చ. నుత్ఫలక మరి
  5. క.గ.చ. కథన మిదియ
  6. క. తెలియ దొందెడ
  7. క. బటుపదార్థాప్తఁ, గ.చ. బదపదార్థాప్తిఁ
  8. గ.చ. దత్పదవిధులన్
  9. క.గ.చ. బిరుదము లనఁ జను దానను
  10. క.గ.చ. వితరణలబ్ధపూర్వ
  11. క.గ.చ. బిరుదావళి చెప్పుట
  12. క.గ.చ. తాళదళంబుల
  13. క.గ.చ. భాషల బొదలుపు, డమరింపుఁడు