పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మద్యపానవర్ణనము

క.

సంబోధకరము మదనా, లంబనము నశేషరసవిలసితము నంత
ర్బింబితవచనము నగు [1]కా, దంబరి నాపానమునకుఁ దగు నొడఁగూర్పన్.

119


మ.

అలినాదంబులు దాసమానములుగా నాలప్తి గావించుఁ [2]దొ
య్యలి యో ర్తొక్కెతె పాడు విశ్వవిభు నేలాదిప్రబంధంబులన్;
గైకొని యోర్తు సాంగముగ వర్తించుం; గళాసించు [3]ను
గ్మలి యో ర్తొక్కతె వ్రాలు సోలములతోఁ గాదంబరీ[4]గోష్ఠిచేన్.

120

సురతవర్ణనము

తే.

[5]తనరు నెనుబదినాల్గుబంధములయందు
నమరుఁ బ్రచ్ఛిన్నమును బ్రకటము ననంగ
సురతములు రెండు; [6]వానికి స్ఫురణసొంపు
వలయు వర్ణింప నిఖిలకార్యములయందు.

121


సీ.

పొలయల్కఁదలఁపులఁ బులకించుఁ, బులకించి బింకంపుఁగౌగిళ్ల బిగి భజించు
మరుచిన్నె లున్నెడఁ బరికించుఁ, బరికించి [7]చొక్కుఁ, జెమర్చినయిక్క లరయుఁ,
దొలిమ్రొక్కు చెలిచెవిఁ జిలికించుఁ, జిలికించి [8]మురిపెంపుసిగ్గున మూరిఁబోవుఁ,
బంజరంబున చిల్కఁ బలికించుఁ, బలికించి నొడువు లాలము లైన నోరు నొక్కు,


తే.

సొబగుటడుగులలదుక చూచుఁ, జూచి
[9]యరిగి శయనీయ మారయ నప్పళించు,
వెలఁది యొక్కర్తు చాళుక్యవిభునిచేత
భావజాతుని గెల్చినభావ మొప్ప.

122

విప్రలంభవర్ణనము

క.

అచ్చపువెన్నెలచేఁ [10]గడు, వెచ్చుటలును మాన మెడలి వెడవిల్తునిచే
నొచ్చుటలును బ్రియుఁ డబ్బని, ముచ్చటలును విప్రలంభమునఁ జెప్పఁదగున్.

123


ఉ.

ఎల్లిద మయ్యెఁ దాల్మి, [11]తగ నెల్ల వివేకము వింత యయ్యె, మి
న్నెల్లను జంద్రుఁ డయ్యె, మన మెల్ల మనోభవుతూపు లయ్యె, మే
నెల్లను సన్న మయ్యెఁ, జెలు లెల్ల విరోధిన లైరి, విశ్వభూ
వల్లభుతోడియల్క గరువంపుఁజలంబునఁ బువ్వుఁబోఁడికిన్.

124

ప్రయాణవర్ణనము

క.

గజరథహయసూచిత మగు, [12]విజయమ్మున నుబ్బి నడుచు విశ్రుతవివిధ
ధ్వజిని వినుతించు టెప్పుడు, భజనీయము సుకవి సత్ప్రబంధములందున్.

125


మ.

కర ముద్యత్కరవాలభైరవపతాకాఖేలనం బై పరి
స్ఫురదుగ్రాయుధదీప్తిపూరితనభోభూభాగ మై సంచర

  1. క.గ.చ. కాదంబరి యావాసమునకు
  2. క.గ.చ. తొయ్యలి యోర్తొక్కతె
  3. క.గ.చ. ఉగ్మలి యొక్కర్తుక
  4. క.చ.గోష్ఠిలోన్, గ. గోష్ఠితోన్
  5. క.గ.చ. తనర నెనబదినాల్గు
  6. క.గ.చ. వాని విస్ఫురణసొంపు
  7. క. చెక్కు చెమర్చిన
  8. క.గ.చ. మురిపంపుసిగ్గున
  9. క.గ.చ. అలగి శయనీయము
  10. క కడుమెచ్చుటలును, గ.చ. కడువెచ్చటులును
  11. క. తగ వెల్లవివేకము. గ.చ. తగ వెల్లివివేకము
  12. క.గ.చ. విజయమునకు నుబ్బి