పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రగల్భధీరాధీర

క.

కినుకయుఁ దాలిమియును జెం, దిన [1]మాటల నాప్రగల్భధీరాధీరాం
గన యుల్లసముల పెనఁకువ, తనముఁ బ్రసాదంబుఁ జూపు[2]తగవరి దలఁపన్.

51


మ.

అతివా నాకుఁ జళుక్యనాథుచతురవ్యాపారముల్ విన్న [3]సం
తతమోదంబు జనించు, నంతటన ధూర్తక్రీడ లాలించినన్
బ్రతిపన్నం బగుఁ గోప, మప్పు డటు సోత్ప్రాసోక్తికిం జొచ్చినన్
హితమందస్మిత మబ్బు మోమునకు ము, న్నీకౌతుకం బెట్టిదో!

52

ప్రగల్భాధీర

క.

కూరిమిపతి తనకోపము వారించినఁ ద్రోచి పిదప వచ్చి యతనిఁ దా
నూరార్చునది ప్రగల్భా, ధీర యనం బరఁగు రసికదృష్టికి నరయన్.

53


శా.

ఆపంచాయుధుపెంపు నాహిమకరాహంకార మాకోకిలా
టోపంబుం దరియింప లేక సతి నిండుంగూర్మితో ధైర్యసీ
మా[4]పర్యాప్తికి నెగ్గుగా మణిగణన్మంజీరపుంజీకృత
[5]క్ష్మాపవ్రాతకిరీటు మ్రొక్కి [6]నిలిచెం జాళుక్యవిశ్వేశ్వరున్.

54


క.

జ్యేష్ఠయు మధ్యాఖ్యయును గ, నిష్ఠయు ననఁ గృతులఁ బరఁగునెలఁతలకును నీ
నిష్ఠితగుణములు వరుసఁ బ్ర, తిష్ఠితములు సరసగతులఁ దెలియఁగవలయున్.

55

అష్టవిధనాయికలు

తే.

కలరు స్వాధీనపతికయు ఖండితయును
బ్రోషితప్రియయును విరహోత్కలికయు
నౌల నభిసారికయుఁ గలహాంతరితయు
[7]సంప్రవాసిని వాసకసజ్జికయును.

56


క.

ఈయెనిమిది శృంగారవి, ధాయి దశాకలిత లైనతరుణుల తెఱఁగుల్
పాయక లక్షణలక్ష్యో, పాయంబులఁ దెలియవలయుఁ బ్రౌఢప్రతిభన్.

57

స్వాధీనభర్తృక

క.

మధురానువర్తి యగు తన, యధిపతిచే నెప్పు డర్పితాభరణాదిన్
బ్రథిత యగుచుండు కోమలి, కథితస్వాధీనభర్తృకాసంజ్ఞ యిలన్.

58


మ.

ప్రతిపక్షప్రతిపాదితక్షతులు చూపన్ జెప్ప లే వెన్నఁడున్
బ్రతికాలస్వకృతోత్సవాభరణభద్రశ్రీవిమిశ్రక్రియా
[8]చతురత్వం బలరారుచుండు నెపుడున్ జాళుక్యవిశ్వేశ్వరుం
బతిగా నోచిన [9]రత్నగర్భ యనులాభం బొప్పుఁబో పృథ్వికిన్.

59
  1. క.గ.చ. మాటలయది
  2. క.గ.చ. తగవడిఁ దలఁపన్
  3. క.గ.చ. సంతతమోహంబు
  4. గ.చ. పర్యాప్తికి సిగ్గుగా
  5. క.గ.చ. క్ష్మాపవ్రాతము చూడ మ్రొక్కి
  6. క.చ. తెలచెం జాళుక్యవిశ్వేశ్వరున్, గ. తెలసెం జాళుక్యవిశ్వేశ్వరున్
  7. క.గ.చ. సంత్రివాదినివాసకసజ్జిక
  8. క.గ.చ. చతురత్వం బెలరారుచుండె
  9. గ.చ. రత్నగర్భయగులాభంబు