పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ధర సర్వంకషగర్వముం బిరుదమాత్సర్యప్రవిధ్వంసమున్
[1]బరభూపాలపలాయనప్రకట్టనప్రౌఢంబుఁ గ్రోధోదయా
కరముం గ్రూరము నై చళుక్యవిభు నుగ్రవ్యగ్రకేతుస్థితాం
బరఖేలత్కరవాలభైరవసురూపం బొప్పుఁ బోరాటలన్·

8

ధీరలలితుఁడు

క.

స్మరభీతుఁడు మానవతీ, పరవశుఁడును భోగలోలుపవ్రతుఁడును సుం
దరుఁడును నయ్యెడు నాయకుఁ, డరయంగా ధీరలలితుఁ డన విలసిల్లున్.

9


చ.

[2]అరు దగురాజ్యతంత్రము [3]నయప్రియుచేతికి నిచ్చి విశ్వభూ
వరుఁ డఖిలాంగసుందరియు వారణయానయు నిత్యదృఙ్మనో
హరయును నై తనర్చువిజయాంగనతోడిద లోక మై నిరం
తరము సుఖించుచుండు నవదర్పకుఁ డై సుధ గర్వ మేర్పడన్.

10

ధీరశాంతుఁడు

క.

సుభగుఁడు శుచియు వివేకియు, నభిమానియు మృదువు [4]సద్ద్విజాతులవంశ
ప్రభవుండును [5]నగునాయకుఁ, డభిమతముగ ధీరశాంతుఁ [6]డనఁ బొగడొందున్.

11


ఉ.

శ్రీయుతు లై యశేషసమచేతను లై వివిధాగమాదివి
ద్యాయతనంబు లై రసికు లై సుఖు లై తరుణీవిహారపు
ష్పాయుధు లై చరింతురు ధరామరు లట్టుల కారె రాజనా
రాయణదేవుచేఁ బడిన నచ్చెరువే యభిరామసంపదల్.

12

శృంగారనాయకులు

క.

ఈనలువురు రసనవకస, మానస్థానముల జననమహిమంబులకున్
మానుగ శృంగారరసా, ధీనులు మఱి నలుగు రండ్రు తెలియఁగ వలయున్.

13


క.

వనితావిహరణదశలం, దనుకూలుఁడు శఠుఁడు దక్షిణాఖ్యుఁడు ధృష్టుం
డును నన నలుగురు నాయకు, లనయము శృంగారమునకు నర్హులు చెప్పన్.

14

అనుకూలుఁడు

క.

ఏకవధూరక్తుండై, యేకొఱఁతయు లేక సమసమీహితగతులన్
గైకొని మెలఁగెడు నాతఁ డ, నాకులుఁ డనుకూలనాయకాఖ్యం బడయున్.

15


శా.

సద్రాగాన్వితగా నొనర్చుఁ గరసంచారోపచారంబులన్
భద్రశ్రీపరిలిప్తఁ జేయు సుమనఃపర్యాప్తఁ గావించు యు
క్తద్రవ్యప్రతిపత్తిచే వసుమతింగాఁ జాలఁ బాలించు ని
ర్ణిద్రప్రీతిఁ జళుక్యనాథుఁడు ధరిత్రీకాంత నెల్లప్పుడున్.

16
  1. గ. చ. పరభూపాళి పలాయన
  2. చ. అరుదుగ
  3. క.గ.చ. నయక్రియ చేతికి నిచ్చి
  4. క.గ.చ. సద్ద్విజామలవంశప్రభవుఁడు
  5. క.గ.చ. అన్నాయకుఁ డభినుతముగ
  6. క.గ.చ. అనఁ బెంపొందున్