పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాక్కరం బెట్టిదనిన

వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
నారయ రెండవనాలవచోట్ల నర్కుండయి ననుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదలు నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర మతిశయిల్లు.

53

మధ్యాక్కరం బెట్లనిన

వరుసతో దేవేంద్రసూర్యవజ్రిరవుల......
విరచించి నాలవపట్టు విశ్రాంతి సదనంబు చేసి
తరబడిఁ దప్పక చెప్పఁదగునండ్రు మధ్యాక్కరంబు
కరవాలభైరవుపెంపు గణషట్కమున నుతియింప.

54

మధురాక్కరం బెట్లనిన

తరణివాసవత్రితయంబు ధవళభానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్థములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయ.

55

అంతరాక్కరం బెట్లనిన

కమలమిత్రుండు సురరాజగణయుగంబు, కమలశత్రునితోఁ జెంది కందళింప
నమరుఁ బ్రావళ్లు నర్ధంబు నతిశయిల్ల, నమల మగునంతరాక్కర మబ్ధిసంఖ్య.

56

అల్పాక్కరం బెట్లనిన

సుమనఃపతియుగము సోముండును, నెమకంగఁ బ్రావళ్లు నిండిమీఱ
గమనీయవిభవంబు గాంచు నెప్డు, రమణీయ మల్పాక్కరము కృతుల.[1]

57

షట్పది

సురపతులిరువురు సురపతులిద్దఱు, సురపయుగమ్ముతో సోముండును
బరువడిఁ బెసఁగొన నరుదుగ షట్పది, సరిఁబ్రాసములు దనరారంగను.

58

చౌపది

భసగానలములపైని గరంబు, న్నెసఁగఁగ మూఁడవయెడ విరమంబుం
బొసఁగినఁ జౌపదిఁ బొలుచు రసంబుల, గసవరముగఁ దగుఁగద ప్రాసంబున్.

59
  1. ఇది గీతపద్యమువలె నున్నది.