ఖచరప్లుతము (న-భ-భ-మ-స-న-వ-11 యతి.)
| నభభముల్ మసనంబు లగాప్తి న్నాగవిభూషణయుగ్యతిన్ | |
21. ప్రకృతిచ్ఛందఃపాదం బేకవింశత్యక్షరంబు
అందు స్రగ్ధరావృత్తము (మ-ర-భ-న-య-య-య-7-7 యతులు.)
| క్ష్మాభృద్భూభృద్యతిన్శ్రీమరభనమయయయామాత్రమై యాదిమాద్య | |
చంపకమాలావృత్తము (న-జ-భ-జ-జ-జ-ర-10 యతి.)
| నజభజజారవర్గము దనర్చి దిశాయతి నర్థయుక్తమై | |
లాటీవిటము (స-స-స-స-మ-త-య-12 యతి.)
| సససా మతయంబులు భానుయతి న్సాకంబై లాణీవిటవృత్తం | |
వనమంజరి (న-జ-జ-జ-జ-భ-ర-13 యతి.)
| తనర నజాజజభాగ్భరకారయుతత్రయోదశయుగ్యతన్ | |
మణిమాల (స-జ-స-జ-స-జ-స-10 యతి.)
| వరుసన్ సజత్రితయము న్బ్రసక్తసగణంబుతోడ నొనరం | |
22. ఆకృతిచ్ఛందఃపాదంబు ద్వావింశత్యక్షరంబు
అందు మహాస్రగ్ధరావృత్తము (స-త-త-న-స-ర-ర-గ-8-7 యతులు.)
| సకలశ్రీవిశ్వభూపా సతతనసరరాసక్తమై యగ్రగాప్తిం | |
భద్రిణీవృత్తము (భ-ర-న-ర-న-ర-న-గ-11 యతి.)
| భాదిరనత్రయంబు గురుయుక్తమై గిరిశవిశ్రమప్రకటమై | |
మానిని (భ-భ-భ-భ-భ-భ-భ-గ-6-6- యతులు.)
| కామిని సప్తభకారము లౌల గకారమునై పరికల్పితమై | |