మత్తకోకిలవృత్తము (ర-స-జ-జ-భ-ర-10 యతి.)
| మత్తశోకిలవృత్త మై దశమప్రవర్తితవిశ్రమా | |
19. అతిధృతిచ్ఛందఃపాదం బేకోనవింశత్యక్షరంబు
అందు శార్దూలవిక్రీడితవృత్తము (మ-స-జ-స-త-త-గ-12 యతి.)
| సంబంధించి దినేశవిశ్రమముతో శార్దూలవిక్రీడితా | |
మేఘవిస్ఫూర్జితవృత్తము (య-మ-న-స-ర-ర-గ-12 యతి.)
| మృదువ్వస్తార్ధంబై దినకరయతి న్మేఘవిస్ఫూర్జితాఖ్యం | |
చంద్రకళ (ర-స-స-త-జ-జ-గ-10 యతి.)
| వ్యక్తరీతి రసాతజజగ్రాయత్తగకారనిరూఢిచే | |
తరలము (ధ్రువకోకిల) (న-భ-ర-స-జ-జ-గ-11 యతి.)
| నభరసంబులు జాగవర్గము వచ్చి యీశ్వరవిశ్రమ | |
భూతిలకము (భ-భ-ర-స-జ-జ-గ-11 యతి.)
| భూతిలకం బగు భారసంబులఁ బొంది జాగము లుండినన్ | |
20. కృతిచ్ఛందఃపాదంబు వింశత్యక్షరంబు
అందు మత్తేభవిక్రీడితవృత్తము (స-భ-ర-న-మ-య-వ-13 యతి.)
| మనమారం బదుమూఁట విశ్రమముగా మత్తేభవిక్రీడితా | |
ఉత్పలమాలావృత్తము (భ-ర-న-భ-భ-ర-లగ-9 యతి.)
| పద్మజయుగ్యతిన్ భరనభారలగంబులఁ జెంది సన్మనః | |
అంబురుహము (భ-భ-భ-భ-ర-స-వ-12 యతి.)
| భానభరంబులపై సభ లొందుచు భానువిశ్రమయక్తమై | |