14. శక్వరీచ్ఛందఃపాదంబు చతుర్దశాక్షరంబు
అందు వసంతతిలకవృత్తము (త-భ-జ-జ-గ-గ-8 యతి.)
| స్థాపించినం దభజజంబు చళుక్య విశ్వ-క్ష్మాపా వసంతతిలకం బగు గానియుక్తిన్. | |
అపరాజితవృత్తము (న-వ-ర-స-ల-గ-9 యతి.)
| ననరసలగముల్ దనర్చిన సత్కృతిం-దనరఁగ నపరాజితంబు కవిస్తుతిన్. | |
వనమయూరము (భ-జ-స-న-గగ-9 యతి.)
| నందయతితో భజననప్రజగగం బిం-పొంది చదువ న్వనమయూర మగు ధాత్రిన్. | |
సుందరము (భ-భ-ర-స-లగ-9 యతి.)
| భారసపంబుల నొప్పుఁ పద్మజవిశ్రమం- బారఁగ సుందరవృత్తమై బుధవర్ణ్యమై. | |
ప్రహరణకలితము (న-న-భ-న-లగ-8 యతి.)
| ప్రహరణకలితంబయి ననభనవల్ -బహువిధయతులం బ్రథఁ జెలు వడరున్. | |
భూనుతము. (ర-న-న-భ-గగ-10 యతి.)
| అందమై రసనభతతి నంది గగంబుల్-పొందఁగాఁ బదగతిఁ గని భూమత మయ్యెన్. | |
15. అతిశక్వరీచ్ఛందఃపాదంబు పంచదశాక్షరంబు
అందు మణిగణనికరవృత్తము (న-న-న-స-9 యతి.)
| పరసత నననన సగణము లెసఁగం-గరియతిఁ గని మణిగణనికర మగున్. | |
మాలినీవృత్తము (న-న-మ-య-య-8 యతి.)
| కరటివిరతి నామక్రాంతయాయుక్తితోడన్ | |
సుకేసరము (న-జ-భ-జ-ర-10 యతి.)
| నజభజరేఫలం గదియ వచ్చి దిగ్యతిన్- సుజనమతి న్సుకేసరము శోభితం బగున్ | |
మణిభూషణము (ర-న-భ-భ-ర-10 యతి.)
| విశ్వభూప మణిభూషణవృత్త మనం జనున్-శశ్వదుక్తరనభారదిశాయతిఁ గూడినన్. | |
మనోజ్ఞము (న-జ-బ-భ-ర-9 యతి.)
| వరుస మనోజ్ఞ మనంగ వచ్చు నజాభర - స్థిరగతిఁ బంకజభూయతిం బ్రతిపన్నమై. | |
16. అష్టిచ్ఛందఃపాదంబు షోడశాక్షరంబు
అందుఁ బద్మకవృత్తము (న-భ-జ-జ-జ-గ-11 యతి.)
| నభజజద్వయగకార సనాతనవిశ్రుతిం- బ్రభవమై పరఁగు సత్కృతిఁ బద్మవృత్తమై | |