ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గాయత్రీచ్ఛందఃపాదంబు షడక్షరం బై
విచిత్రవృత్తము (యయ.)
| విచిత్రంబునందున్- రుచించున్ యయంబుల్. | |
తనుమధ్యావృత్తము త్రయ.)
| ఒప్పున్ తయ యుస్తం- జెప్పం దనుమధ్యన్. | |
సురలత (సయ)
| సురలతఁ జెప్పన్ - సొరది నయంబుల్. | |
ఉష్ణిక్ ఛందఃపాదంబు సప్తాక్షరంబై
విభూతివృత్తము (రజగ.)
| స్వస్థ సద్విభూతి దా-రస్థ జస్థగంబునన్. | |
మదనవిలసితము (ననగ.)
మదనవిలసిత- ప్రదములు ననగల్.
కుమారలలిత (జనగ.)
| కుమార లలితకున్-సమగ్రజనగముల్. | |
అనుష్టుప్ఛందఃపాదం బష్టాక్షరం బై
విద్యున్మాల యనువృత్తము (మమగగ.)
| శ్రీలీలన్ రాజిల్లు విద్యున్మాలాఖ్యం బై మాగాసక్తిన్. | |
చిత్రపదము (భభగగ.)
| చిత్రపదం బన భాగా-చిత్రయతిప్రతిపత్తిన్. | |
ప్రమాణి (జరవ.)
| జకారముఁ రకారము-వకారముం బ్రమాణికిన్. | |
సమాని (రజప.)
| ఈసమానికిన్ రజన-వ్యాస మొప్పగుం గృతులన్. | |
సింహరేఖ(రజగగ.)
| ఈరజాగ్రగా నియుక్తిన్-గోరి సింహరేఖ యొప్పున్. | |
బృహతీచ్ఛందఃపాదంబు నవాక్షరం బై