పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆదట నక్షరగణనో, త్పాదితగణసంప్రవృత్తితంత్రముచేఁ [1]గా
కోదరుఁడు గరుడునిం బ్ర, చ్ఛాదించుట ఛంద మనఁగ [2]జగతిం బరఁగున్.

89


క.

[3]ఇది లౌకికవైదికవా, క్పద మై పడ్వింశతి ప్రపంచాత్మక మై
మై షడ్వింశతిప్రపంచాత్మక మై
పొదలుం దెలియఁగవలయును, ముదమున నభిధానరూపముల చందంబుల్.

90


వ.

ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు,
బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిజగతి, శక్వరి అతిశక్వరి, అష్టి, అత్యష్టి,
ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అతికృతి, ఉత్కృతి,
అనం బ్రవర్తిల్లు; నందు నుక్తాదిచ్ఛందంబు లొక్కయక్షరంబునుండి యొండొంటికొ
క్కొక్క యక్షరంబుగా షడ్వింశాక్షరపర్యంతంబుఁ బెరుఁగు. అందు నుక్తాచ్ఛం
దంబునఁ బ్రతిపాదంబున కేకాక్షరం బై శ్రీ యను వృత్తం బయ్యె;
                 శ్రీ-శ్రీ-జే-యున్

91

అత్యుక్తాచ్ఛందఃపాదంబు ద్వ్యక్షరం బందు స్త్రీ యను వృత్తం బయ్యె :

                 స్త్రీరూ-పారు-గారూ-పారున్.

మధ్యాచ్ఛందంబు త్ర్యక్షరంబై నారీవృత్తంబునకు జనకం బయ్యె :

నారీవృ- త్తారంభంబారు న్మా- కారం బై,

ప్రతిష్ఠాచ్ఛందఃపాదంబు చతురక్షరం బై

కన్యావృత్తము

పొత్తై మాగా-వృత్తిం గన్యా-వృత్తం బయ్యెన్-జిత్తం బారన్

సుకాంతివృత్తము (జగ.)

జగంబులదం-గున్ సుకాం-తి గల్పిక-ప్రగల్భతన్.

సుప్రతిష్ఠాచ్ఛందఃపాదంబు పంచాక్షరం బై

సుందరీవృత్తము (భగగ.)

సుందరి యొప్పుం-జెంది భగా నిం-పొంద నియుక్తిన్-గందుకలీలన్.

ప్రగుణవృత్తము (సగగ.)

సగణాసక్తిం-గగసంయుక్తిన్-బ్రగుణాఖ్యం బై-తగు నింపారన్.

అంబుజవృత్తము (భవ.)

ఇంబగు భకా-రంబును వకా-రంబును జుమీ యంబుజ మగున్.

విచ్ఛందోధికారము

క.

ఇం దుండియుఁ గరణీయ, చ్ఛందోవృత్తముల నర్థసంజ్ఞితములుగా
నొందింతు గ్రంథవిస్తృతి, క్రందునకుం గాక యర్థగౌరవ మొప్పన్.

93
  1. గ.చ. కాకోదరము
  2. క.గ.చ. జగతిం బరఁగెన్
  3. క.గ.చ. అది లౌకిక