పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/9

ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

జూపును, ఈ కలికాలమున మానవులలో పాటవము తప్పిపోవుటచే నెద్దియు సాధింపలేరు. ఈ విషయమే,

చ " అలసులు మందబుద్ధిబలు అల్పతరాయువు లుగ్రరోగ సం కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయజాల కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై యలవడు నేమిటం బొడము నాక్మకు శాంతి మునీంద్ర! చెప్పవే”

అని శ్రీమదాంధ్రభాగవతమున నుడువఁబడి యున్నది. పై పద్యమందలి భావమునకుఁ దగినట్లే యీ కాలమునందలి మానవులట్టి వారగుటచే వారికా యోగసాధనములం దాదరాభిమానములు క్షీణించుటచే నవి యెల్లమూలఁ బడినవి. కాని మందునకై న మన దేశమున నీశకు లచ్చటచ్చట కొందఱు యోగీశ్వరులందు గోచరించుచున్నవి. అణిమాద్యష్టసిద్ధుల బడసిన వారల ననేకుల గురించి మనము వినుచున్నాము. గోరక్ , కబీరు, మున్నగు వారనే కులీసిద్ధులఁ బడసినవారు. ఇట్టి సిద్ధుల నొసఁగునదియే యష్టాంగ యోగము.

శ్రీమద్భాగవతమున ప్రాణాయామాభ్యాసము శాస్త్రోక్త మార్గమున విశేషముగ సాధించిన తో కొన్ని సిద్ధుల బడయగల్గుఫుము దృష్ట ముగుచున్నట్లున్నది.

"అనూరి మత్వం దేహేస్మిక్ దూరశ్రవణ దర్శనమ్ ! 'మనోజవః కామరూపం పరకాయ ప్రవేశనమ్ | స్వచ్ఛందమృత్యు దేవానాం సహక్రీడాను దర్శనం యథా సంకల్పసంసిద్ధి రాజ్ఞా ప్రతిహతా గతిః ॥ త్రికాలజ్ఞత్వమద్వంద్వం పర చిత్తాద్యభిజ్ఞతా ! అగ్న్యర్కాంబు విషాదీనాం ప్రతిష్టంభో పరాజయః ॥ ఏతాశ్చో దేశతః ప్రోక్తా యోగధారణ సిద్ధయః ॥ శ్రీమద్భాగవతే