పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/6

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

లోని వివిధపదార్థములపై నాధారపడవలసి యున్నది. మోటారు, దూర శ్రవణము, విమానము మున్నగునవి యనుభవింపవలయుననిన సన్నని రాగితీఁగే.., విద్యుద్ధ టములు, చమురు, మున్నగు వస్తుసముదాయము కావలసి యున్నది. అది చెడిపోయినచో కార్యము సిద్ధింపదు. మన ఆర్యవాఙ్మయము నందును త త్తత్రాంత భాషలందును గలవాఙ్మయమున మనవారును దూరశ్రవణ వ్యోమయానాదులు సాధించికొని నట్లు తెలియుచున్నది. వారికి పాశ్చాత్యులకు కావలసినన్ని బాహ్య పరికరముల సాయములేకయే యోగమే సాధనోపాయమని తెలియుచున్నది.

జలాంతర్గమనము భారతమున దుర్యోధనుఁడు భీమునితో గదా యుద్ధమునకు వచ్చుటకు మున్ను కొలనిలో జలస్థంభన విద్యచే డాఁగి యుండెననియు నాతఁడు దురభిమాని గావున భీముఁడు ఈ సడింపు మాడలు పలుకగా సైఁవలేక కొలనినుండి వెలుపలికి వచ్చినట్లును తెలియుచున్నది. మహాభారతము శల్యపర్వమున " అని చెప్పి యటనున్న ద్వైపాయన హ్రదంబునం బ్రవేశించి తన మాయావిద్యా ప్రభావంబున జలంబులు తన్నంటకుండ స్థంభసంబు గావించికొని,” (శ్రీ కృష్ణభారతము - శల్యపర్వం ద్వితీయాశ్వాసము 176.)

దూరశ్రవణ దూరదృష్టులను గురించిన విషయము కళాపూర్ణోదయమున మణికంధరుఁడు తటాకమున జలస్థంభనాది విద్యల నెఱింగిన సిద్దుని విషయము కలభాషిణితో నుడువునపుడు. చెవిలోనఁ జెప్పంగఁజేరి యెహోయది కాదుపాయ మతుడు గట్టిగాను దూరశ్రవణశక్తి ఁ దోడ్తోడ వినియెడు నటుగాన వ్రాసి నీ కది తెలిపెదననిన