పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/10

ఈ పుటను అచ్చుదిద్దలేదు

11


యోగప్రశంస

యోగమను పదము పతంజలి మహర్షి ప్రకారము యోగశ్చిత్తవృత్తి నిరోధః ? అని సర్వవిషయములనుండి యంతఃకరణవృత్తుల నిరోధించుటయే యోగమను నర్థమును బోధించుచున్నది.

"సంయోగం యోగ మిత్యాహుర్జీవాత్మ పరమాత్మయోః

అని యోగమన జీవాత్మపరమాత్మ యోగమనియుఁ గలదు. ఇంకను నీ యోగశబ్దమునకు సంయోగము, మేళనము, ఉపాయము, కర్మాది ధారణము, ధ్యానము, యుక్తి, అభ్యర్థలాభి చింత, దేహస్థైర్యము, శబ్దాదిప్రయోగను', భేషజము, ద్రవ్యము, జ్యోతిష శాస్త్రోక్త విష్కంభాది యోగములు, మున్నగు నర్థము లనేకములున్నను నిట చిత్తవృత్తి నిరోధరూప యోగమనియే యర్థము. చిత్తవృత్తి నిరోధరూపమగు యోగము రెండువిధములు. అవి రాజయోగము యోగము. అందు రాజయోగము పతంజలిచే నుడువబడినది. హరయోగము తంత్రశాస్త్రమందు నడువబడినది. ఇదియే ప్రకారాంతరమున మూడువిధములనియు నుడువ బడియున్నది. ఈ విషయమే భాగపతమున

శ్రీభగవానువాచ :-

"యోగాస్త్రయా మయా ప్రోక్తా నృణాం శ్రేయోవిధిత్సయా | జ్ఞానం కర్మి చ భ క్తిశ్చ నోపా యోజన్యో స్తి కుత్రచిత్ నిర్విజ్ఞానాం జ్ఞానయోగో న్యాసినామిహ కర్మను | తెష్వనిర్వీణ్ణ చిత్తానాం కర్మయోగశ్చ కామినామ్ || యదృచ్ఛయా మత్కథాదౌ జాతశ్రద్ధస్తు యః పుమా౯ | న నిర్విణో నాతిసక్తో భ క్తి యోగో ఒస్య సిద్ధిదః ॥ U