వృక్షశాస్త్రము/గులాబి కుటుంబము

పెద్ద దూలగొండ:- తీగె దొంకలమీద ప్రాకును.

దీనిఆకులు చిక్కుడాకుల వలె నుండును. వీనిపై మెత్తని రోమములు గలవు. ఆకులు దేహమునకు దగిలినచో దురద పెట్టును. ఈ దురద, రోమముల లోనుండి వచ్చు ద్రవ పదార్థము మన చర్మము పై బడుటచే గలుగు చున్నది. మృగము లేవియు దీనిని తినకుండ సంరక్షించుకొనుటకై ఇది యొక మార్గము.


గులాబి కుటుంబము.


ఈకుటుంబపు మొక్కలు శీతలదేశములలో ఎక్కువగా పెరుగుచున్నవి కాని మన దేశములో అంతగా లేవు. కొన్నిటి ఆకులు లఘు పత్రములు, కొన్నిటివి మిశ్రమ పత్రములు కాని అన్నిటి యందును ఒంటరి చేరిక్యే. ఆకులకు గణుపు పుచ్చములు గలవు. పుష్పములు చిక్కుడు పువ్వు వలె నుండక సరాళముగ నుండును. పుష్ప కోశము నందును దళ వలయము నందును అయిదేసి రేకులున్నవి. ఇవి మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు చాల గలవు. ఇవి పుష్ప కోశము నంటి యుండును. అండాశయము లొకటైనను ఎక్కువగా నైనను నుండును. కాయలు కొన్నిటిలో కండ కాయలుగను కొన్నిటిలో ఎండు కాయలుగను వున్నవి. ఈ కుటుంబములో ఉపయుక్త మైన మొక్కలు గలవు.

గులాబి మొక్క చిర కాలము నుండి మన దేశములో పెరుగు చున్నది. దీనిలో చాల రకములున్నవి. కొన్నింటియ్ందు రేకు లెక్కువగా నున్నవి. కొన్ని ముదురు రంగుగను, కొన్ని మిక్కిలి లేత రంగుగను నున్నవి. మరికొన్ని తెల్లగా నున్నవి. ఈ భేదములన్నియు ఇంచు మించు సేద్య భేదము వలన వచ్చినవని చెప్పుచున్నారు.

గులాబిపువ్వు మిక్కిలి మనోహరమైన పుష్పము. ఇది ఇంపుగాను సువాసన గాను నుండును. దీని నుండియే అత్తరు చేయుదురు. మొట్ట మొదట అత్తరు జహంగీరు నూర్జహానుని వివాహమాడినపుడు చేసిరట.

అత్తరుచేయుటకు పువ్వులను ప్రొద్దున కోసి ఒక యంత్ర శాలకు గొనిపోయి అచ్చట బట్టిలో వేసెదరు. పువ్వులన్నియు నొక పెద్ద కాగులో వేసి నీళ్ళు పోయుదురు. ఈ కాగునకు సన్నని మూతి యుండును. ఈ మూతిలో నుండి మరియొక పాత్ర లోనికి వెదురు గొట్టముండును. వెదురు గొట్టమును, పాత్రను చల్లనినీళ్ళలో బెట్టి కాగుక్రింద సన్నని మంట పెట్టుదురు.

గులాబి వాసన నీళ్ళకు వచ్చును. ఈనీళ్ళు కాగుటచే ఆవిరియై వెదురుగొట్టము ద్వారా బోవును. కాని వెదురు గొట్టమును రెండవపాత్రయు చల్లని నీళ్ళలో నుండుటచే ఆవిరి మరల నీరై ఆ పాత్రలో బడును. మరల పువ్వులను వేసి కాచు నపుడు వట్టి నీరు బోయక ఆ పాత్రలోనికి వచ్చిన దానిని బోసెదరు. ఇది మరల బాత్రలోబడిన తరువాత నొక గాజు తొట్టిలో జేర్చి వారము దినములు ఎండ బెట్టుదురు. తరువాత దానిపై గట్టిగ మూత వేసి తడి రాగిడి మట్టిని పూసి ఒక రాత్రి యంతయు నీళ్ళున్న ఒక గోతిలో బెట్టుదురు. మరునాటి ఉదయమునకు అత్తరు పైకి తేలి యుండును. దీనప్పుడు వేరు జేసి సీసాలలో వేసి అమ్ముదురు. కొందరు గులాబి పువ్వులతో మంచి గందపు చెక్కలను గలిపి బట్టి పట్టు చున్నారు. మనకు సాధారణముగ బజారులలో దొరకు పన్నీరు నందు విస్తారముగ నీళ్ళు గలవు.

ఆల్బకర చెట్టు:- మన దేశములో పంజాబు నందును హిమాలయా ప్రాంతము లందును పెరుగుచున్నది. దీని కాయలు తినుటకు బాగుండును. అవి పుల్ల పుల్లగా నుండి అపథ్యము కామిచే రోగులకుకూడ తినుటకు ఇచ్చుచుందురు.

సీమబాదము:- చెట్లు మనదేశములో పంజాబు కాశ్మీర రాష్ట్రములందు మాత్రము పెరుగుచున్నవి. కొన్ని చె ట్లకాయల పప్పు తియ్యగాను7 కొన్నిటిది చేదుగాను వుండును. ఇది బలము నిచ్చు పదార్థము. వెలహెచ్చుగనుండుట చేతను మనమంతగా వాడుట లేదు. కాని కొన్ని పిండి వంటలందు మాత్రముఉపయోగించు చున్నారు.

కాశీరేగు. పుష్పము చీలిక, ఫలము చీలిక.


ము. కొందరీపప్పును ఔషదములందు వాడుచున్నారు. దీని నుండి చమురు తీసెదరు. చమురునకు తియ్యని పప్పు చేదు పప్పుకూడ పనికి వచ్చును. ఈ చమురు సుగంధపు నూనెలలో వాడు చున్నారు. ఈనూనెకు మంచి పరిమెళము గలదు. ఈచెట్లనుండి మంచి జిగిరు కూడ వచ్చుచున్నది.

కాశిరేగు:- చెట్టు ఎత్తగు ప్రదేశములలో పెరుగు చున్నది. దీనిని పై దేశముల నుండి కొని వచ్చిపర్వతముల మీద పైరు చేయు చున్నారు. గింజలు కూడ మొక్కలు మొలచును గాని అంటు పాతిన మొక్కలంత బాగుగ నుండవు. వీనికి గంకరనేల మంచిది. మనము తిను పండు నిజమగు పండు గాదు. పువ్వున కడుగున నుండెడు కాడయె పెద్దదై నిజమగు కాయ నావరించి కండగట్టి పెరుగు చున్నది. ఈ పండ్లు పుష్టి చేయునందురు.

బెరికాయలు:- ఇవి కూడ కాశీరేగు పండ్లతో గలిపి అమ్ముదురు. ఇవియు నీల గిరి పర్వతముల మీదను, బెంగుళూరు వద్దను పైరు చేయు చున్నారు. దీనిని వర్షాకాలము ముందు కొమ్మలు పాతి పెంచెదరు. ఈ కాయలు చెన్న పట్టణమునకు బెంగుళూరు నుండి వచ్చుచున్నవి గాని అన్ని చోట్లను లేవు.

అలుబాలు:- చెట్టు పంజాబులో పెరుగు చున్నది. దీని కలప మిక్కిలి బాగుండును. ఇది కుర్చీలు బల్లలు చేయుటకు ను పిడేళ్ళు, పిల్లంగోరులు మొదలగు సంగీత సాధనములు చేయుటకు బాగుండును. దీని పప్పు మనము తినము గాని ఐరోపా దేశస్థులు నిలువ చేసి తిందురు. దీని నుండి జిగురును వచ్చు చున్నది. అది మంచిది కాదు.


ఉప్పుపొన్న కుటుంబము.


ఈ కుటుంబపు చెట్టు నీటితీరముల బురదలో పెరుగును. ఆకులు అభిముఖ చేరిక, కణుపు పుచ్చములుండును. ఈ కణుపుచ్చములు తొగరు చెట్టు నందున్నట్లు రెండాకులకు మధ్యగా నుండును. మిధున పుష్పములు. పుష్పకోశము అండాశయము నంటి స్థిరరముగా నుండును. ఆకర్షణ పత్రము రక్షక పత్రములన్ని యుండును. కింజల్కములు వానికి రెట్టింపు. అండకోశము ఉచ్చము. కాయ బ్రద్దలవదు. ఈ చెట్టు మెత్తని బురద నేలలో బెరుగును గాన గాలికి బడి పోకుండ నుండుటకు మాను నుండియు గొమ్మల నుండియు గూడ వ్రేళ్ళు క్రిందికి దిగు చుండును. కొన్ని చెట్లలో గింజలు కాయ నుండి బయటకు బడకమునుపే, గింజలలో నుండి వ్రేళ్ళు క్రిందకు వచ్చుచున్నవి.

ఉప్పుపొన్న చెట్లు బెరడు నుండి యొక రంగును తోలు బాగు చేయు పదార్థమును దీయ వచ్చును. కాని ఈ పదా