మణి మాలికలు/మణిమాలికలు - మెరుపు కవిత్వం!

మణిమాలికలు - మెరుపు కవిత్వం!

కవి యాకూబ్‌

     we have acountry of words-speak speak
            so i can put my road on the stone of stone.

     we have a coumtry of words-speak speak
          so we may know the end of this travel.

Mahmoud Darwish(paleastian poet)

కవిత్వం కేవలం అక్షరాలు మాత్రమేకాదు. అది ప్రపంచం మాట్లాడే భాష. దృష్టికోణం. కవులనే వాళ్ళు రాస్తున్నదేదీ కేవలం వ్యక్తిగతం మాత్రమే కాదు. అది సమాజపుప్రతిఫలనం. సాహిత్యకారులు సృజిస్తున్న ఏ అంశమూ కూడ పరిమితమైన అర్థాలతో మాత్రమే ఉండదు. అది మొత్తం సామాజిక వాస్తవికతను ప్రతిఫలిస్తుందనే వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాల్సి వుంటుంది. మణిమాలికలను నేను చదువుతున్నప్పుడు ఇది కేవలం ఆయా కవులకే పరిమితమై నౖ భావాల వ్యకీక్త ర ణ గా మాత్రమే చూడలనిపించలదే. సామాజిక సందర్భం ,ఇవి రాయడనికి ఏ విధా గా పురికొల్పిందో బేరీజు వేసూ చదవడం ముగించాను. ఈ కవులు యాడృచ్ఛికంగానే ఇన్ని భావాలు రాయగల శక్తి వచ్చిందా? లేక చుట్టూవున్న సామాజిక స్థితిగతులు ఇటువిం మానసిక కిటికీ తయారవడానికి, తమల్ని తాము ఇప్పుడున్న ఉక్కపోసిన తనం, కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు

ఇత్యాది అంశాలు ఈవిధంగా వ్యక్తీకరించుకోడనికి ప్రేరిపించాయా? అనే కోణంలో చూడడానికి కూడ పురికొల్పాయి. ఇక 'మణిమాలికల' సందర్భంలోకి వస్తే.., చెప్పదలచుకున్న విషయాన్ని వీలైనంత తక్కువ నిడివిలో సూటిగా చెప్పడం అతిక్లుప్తత అనే లక్షణం.కవిత్వానికి ప్రధానంగా ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే. విషయాన్ని వ్యక్తీకరించే పద్దతి, చెప్పేపద్దతి, అభివ్యక్తి ఇందులో వాక్యనిర్మాణమూ, భాష,వాడిన ప్రతీకలు మొదలగునవన్నీ కలగలిసి, అభివ్యక్తీకరించడం తో పాటు, ఆ అనుభవాన్ని పాఠకుల్లో కలిగించఘడానికి ఉపయోగపడే భావచిత్రాలను ఆశ్రయించడం ఒక కవితా విధానం. అంటే, కవిత్వంలో చెప్పే విషయమూ, చెప్పే పద్దతీ రెండూ సమ ప్రాధాన్యతను కలిగి, దృశ్యం రూపుకట్టడంలో భావచిత్రం పనికొస్తుంది. భావచిత్రాలతో చెప్ప డం ద్వారా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండానే కవి చూపించదలచుకున్న, చెప్పదలచుకున్న విషయం పాఠకుడి మనస్సులో రూపుకడుతుంది.

కవిత్వంలో ఇమాజినేషన్‌ - భావానాశక్తికి ప్రధానమైన స్థానం వుంది.
అంటే ఊహించగల శక్తి. వస్తువులను, వివిధ పరిస్థితులను, వివిధ చర్యలను ప్రతిబింబించే సామర్థ్యం. క్రమబద్ధత లేని అనుభవంలో- ఒక క్రమాన్ని చూపడమే, ఏర్పర్చడమే ఈ భావనాశక్తి అని చెప్పొచ్చు. దీన్ని సృజనాత్మకత, ఊహాశక్తి అని కూడ అనవచ్చు.

మణిమాలికలు క్లుప్తంగా సాగే ఒకానొక ప్రక్రియగా, అతిక్లుప్తతతో, భావనాశక్తితో రూపుదిద్దుకొని పాఠకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఫేస్ బుక్లో ఇదొక గ్రూపుగా, వేదికగా ప్రాచుర్యం పొందుతూ ఉండడం ఈ క్లుప్త కవిత్వప్రయోగ సఫలతను చూపిస్తుంది. మొదటి వాక్యము రెండవ వాక్యానికి సంబంధించిన పదాల నిడివిని ముందే నిర్ణయించు
కొని, ఆ పరిధిలో, చెప్ప దలచిన భావాన్ని కుదించి చెప్పడం కవి నైపుణ్యానికి సవాలే. ఆ పరిమిత చట్రంలో చెప్పదలచిన, పాఠకుడికి చేరవలసిన భావనను చేరవేయడం కూడ ఎంతో నేర్పుగా వ్యక్తీకరించడం ఒకరకంగా కత్తిమీద సామే. ఇన్ని చట్రాలను, ఇన్ని పరిమితులను అధిగమిస్తూ మణిమాలికల వేదికలో అనేకమంది రాయడం సంతోషించే
విషయం. అందులోంచి 20 మంది ఇవాళ ఈ పుస్తకరూపంలో వెలుగుచూస్తుండడం మంచి పరిణామం.

మణిమాలికలు మెరుపుల్లా, తటిల్లతల్లా ఉంటాయి. వేగవంతమైన ప్రవాహ జీవితంలో రెండుపాదాలుగా విస్తరించే భావ ప్రకటనలివి. ఒక విధంగా చూస్తే ఇవి, సెల్‌ ఫోనులో మెసేజుల్లా కనిపిస్తున్నాయి.

గతంలో ఈమణిమాలికలకు దగ్గరి పోలికలున్నవి అనేకం కనిపిస్తాయి. కొద్దితేడాతో నానీలు, నానోలు, ఫెంటోలు, ఇంకా వెనక్కువెళితే ద్విపదాలు, ధ్యానం రూపుగట్టిన హైకూలు కనిపిస్తాయి. ఐతే ఇప్పుడు ఒక విషయాన్ని పాఠకులకు అందించడానికి ఎన్నుకొనే సాధనం, లేదా సాంకేతిక క్రమంగా ఈ మణిమాలికల మాధ్యమం కనిపిస్తుంది.

ఇందులో ప్రధానంగా కనిపించే వస్తువులు-ప్రేమ, విరహం, వెన్నెల, ఎడబాటు, ప్రకృతి, కాంక్ష, వైఫల్యాలు, జీవితం మొదాలైనవి. మచ్చుకి, కొన్ని మణిమాలికలు




ప్రసాద్‌ అట్లూరి  : నేల నిద్రకి ఉపక్రమించినట్లు ఉన్నది...
                                  వెన్నెలదుప్పటి కప్పుతోంది నింగి ప్రేమతో

పద్మకుమారి వంగర  : ఏంటో పేజీలు తడిసినట్లున్నాయి
                                   నువ్వు ఏడ్చావా డైరీ

భారతీరాయన్న కాట్రగడ్డ : కాలానికి కూడ దుఃఖమే
                                             నీవులేని నన్ను చూసి
దేవరాజుల దయానంద్‌ రావ్‌ : నీకంటే మృత్యువు ఎంతోనయం
                                             వేలసార్లు వేధించి వధించదు
జానకి పాదుక : వచ్చివెళ్ళిందే తెలియలేదు
                                         యవ్వనానికి బహుశా ఆయువు బహుతక్కువ'
                                                       '
లక్ష్మీ యలమంచిలి  : అసంకల్పిత చర్యలా
                                            కన్నుమూస్తే చాలు కలల్లో చొరబడతావ్‌
మాధావీ ప్రసాద్‌ .కె  : నీకన్న అద్దమే ఎంతో నయం
                                            నేనేడిస్తే అది ఎప్పుడూ నవ్వదు
శ్రీనివాస్‌ యల్లాప్రగడ  : మనుషుల్ని గుర్తుపట్టాలంటే
                                            ముందునువ్వు మనిషివైవుండాలిగా
రాజేష్‌ యాళ్ళ నాకు వ్యాకరణం రాదు కానీ
                                            నీవే కర్త కర్మ క్రియ
రాంకిషన్‌ గొల్లపెల్లి రెండు కణాలు సంకలిస్తే జననం
                                            ఒకక్షణం పఠీల్మని పగిలితే మరణం
సాయి కామేష్‌ గంటి చెత్తబుట్ట నోరుతెరిచింది
                                            తొలి ప్రేమలేఖ రాయడం మొదలెట్టగానే
సంతోష్‌ కుమార్‌ కొత్తా వేసవి తుమ్మెద..సూరీడు
                                            ఓపికనే తేనెని జుర్రేస్తూ
సిరి వడ్డే మరణానికైనా అడ్డుచెప్పను
                                            మరుజన్మలోనైనా మనసిస్తానని నువ్‌ మాటిస్తే
శ్రీ వెంకటేష్‌ గ్రంథి ఆరుపలకల దేహం
                                           తినకపోవడం వల్లకాదు తినడానికి లేకపోవడంవల్ల
శ్రీనివాస RVSS ఊహాచిత్రాలు గీస్తూనే ఉంటాను అసంఖ్యాకంగా
                                           అస్పష్టమైన నీరూపం స్పష్టమయ్యే దాకా
సుకన్యా బీగుడెం అక్షరాల భావానికి ముద్దివ్వాలి
                                            నీ మదిని తాకినందుకు
సురేష్‌ బాబు రావి ఈలోకం

9

బతికున్న శవాల రంగులరాట్నం
స్వర్ణలతా నాయుడు జ్ఞాపకాల పుస్తకం తెరిచి చూసా
                                          నవ్వింది కొంటెగా నీ అల్లరిపుట
విశ్వనాథ్‌ గౌడ్‌ ఈడిగ భూమి విశాలమైనదే
                                         నాది, నీదంటూ కంచెలు వేస్తారంతే
మాధావీ అన్నాప్రగడ కాలం కాన్వాసుపై
                                         క్షణాలుగీసే చిత్రాలెన్నో

ఇవన్నీ చదివితే చుట్టూవున్న జీవితం, సమాజం, మానవ సంబంధాలు, వాటిపరిణామాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ముందుగా చెప్పుకున్నట్టు ప్రేమ, విరహం ఇత్యాదిఅంశాల గురించి రాసినవి ఎక్కువే. కొన్ని గాఢతగా వ్యక్తీకరించినవి, మరికొన్ని అలవోకతనంతో సాగినవి. ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురిచేసే మణిమాలికలు కూడ లెక్కకు మించే ఉన్నాయి. సంతోషించాల్సిన విషయ మేమిటంటే, ఒకప్పటిలా కాకుండ, ఫేసుబుక్‌ పుణ్యమా అని కవిత్వరంగానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు, తమతమ స్థాయిలలో తమ భావాలను, కవిత్వ వ్యక్తీకరణగా మలిచే ప్రయత్నం చేయడం.

పదునైన , మెరుగైన ఊహాశాలిత్వం ప్రదర్శించడం . దానికి మణిమాలిక వేదిక కావడం శుభపరిణామం. సహజంగా స్పందించడం, రాయడం, జీవితాన్ని పలకడం, జీవితాన్ని చుట్టుకొనివున్న ప్రకంపనాల్ని, వేదనల్ని, సంతోషాల్ని, సందర్భాల్ని కవిత్వీకరించడం అనే పనికి పూనుకున్నందుకు ఇందులో రాసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ... జయహో!

10