పుట చర్చ:Womeninthesmrtis026349mbp.pdf/118

తాజా వ్యాఖ్య: సవరణలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Ramesam54

సవరణలు

మార్చు

100 వ పుటకును 101 వ పుటకును నడుమ నీక్రింది వాక్యములుండవలెను: వసిష్ఠుడు అక్షతయోనిని వివాహమాడవలెనని చెప్పుచున్నాడు.

       అస్పృష్టమైధునామ వరయవీయసీం (వసిష్ఠ. 8-1)

దీనినిబట్టి వసిష్ఠుని మతములో యక్షతయోనిగనున్న స్త్రీని వివాహమాడవచ్చునని మాత్రమే తెలియుచున్నది. అట్టి స్త్రీ వితంతువగుచో నామెను వివాహమాడవచ్చునని యాతని మతమైనట్లీ క్రింది శ్లోకమువలన తెలియుచున్నది.

      పాణిగ్రాహే మృతేబాలా కేవలం మంత్రసంస్కృతా
      సాచేదక్షతయోనిస్స్యాత్పున స్సంస్కారమర్హతి.
                                     (వసిష్ఠ. 17 - 14)

(మంత్రసంస్కృతయు నక్షతయోనియునగు బాలికకు భర్తమరణించుచో నామె మఱల వివాహ సంస్కారమున కర్హురాలు.)

ఇట్టి పునర్వివాహములో కన్యాదానముండదు. దానమై మంత్రసంస్కారము కాకుండ భర్తను కోల్పోయిన స్త్రీకే మఱల దానము గలదని యీక్రింద శ్లోకమువలన తెలియు చున్నది.

       అద్భిర్వాచా చదత్తాయాం మ్రియాతాదౌవరోయది
       నచమంత్రోపనీతాస్యాత్కుమారీ పితురేవసా
                                         (వసిష్ఠ 17-12)

(కన్య యుదకముచేతను వాక్కుచేతను నీయబడినదై మంత్రసంస్కృత కాకుండగనే భర్తను కోల్పోవుచో నామె తండ్రికే చెందును.) మంత్ర సంస్కారమైన పిమ్మట నామె తండ్రికి చెందదు. కావుననే మంత్ర సంస్కారము కాకుండిన కాలములో నామె తండ్రికి చెందునని చెప్పబడినది. నారదుడు కూడ నట్టి స్త్రీకి పునర్వివాహము నంగీకరించినాడు. కాని యామె పునర్భువని యంగీకరించినాడు.

      కన్యైవాక్షతయో నిర్యాపాణిగ్రహణదూషితా
      పునర్భూః ప్రథమాప్రోక్తా పునస్సంస్కారమర్హతి
                                      (నారద. 12-16)

కావుననే నారదు డట్టి స్త్రీ యేడువిధములగు పరపూర్వలలో నొకతెనుగనంగీకరించినాడు.

      పరపూర్వా స్త్రీయస్త్వన్యా: సప్తప్రోక్తా యథాక్రమం
                                           (నారద. 12-45)

అని యేడువిధముల పరపూర్వలను పేర్కొనుటలో నారదుడు పైమాటలను చెప్పియున్నాడు.

నారద వసిష్ఠులు దక్క మఱియే స్మృతికారుడును నక్షతయోనికా పునర్వివాహము నంగీకరింపలేదు. Ramesam54 (చర్చ) 00:38, 28 ఫిబ్రవరి 2023 (UTC)Reply

Return to "Womeninthesmrtis026349mbp.pdf/118" page.