こ చెళ్ళపిళ్ళ నరస కవి ፄ ఈ కవి 18.వ శతాబ్దపు తుదినుండి 18.వ శతాబ్దపు తొలిరోగము వరకు వర్తిల్లినవాఁడు. తండ్రి చెళ్ళపిళ్ళ కామయ, తల్లి వెంకమూంబ, స్వగ్రామము గోదావరిజిల్లాలోని కడియము. యామినీపూర్ణతిలకా విలా సము, వెంకటేశ్వరవిలాసము, ఏకప్రాస కందగోపాలశతకము, అహల్యా సంక్రందనవిలాసము, ఏకాంతసేవాకలాపము వీరి కృతులు. ఈ స్తుతి పద్యములు వెంకటేశ్వరవిలాసములోనివి. శ్రీ వేంకటేశ్వరుఁడు చెంచు కన్నెం బెండ్లియాడుట యిందలి యితివృత్తము. వెంకటేశ్వరవిలాసము సీ|| వలరాజుగాన్పు చిల్వలరాజుపాన్పు గ ల్వలరాజులొన్పుగా గలుగు వాఁడు కడలేని కల్మి యొక్కడలేనిబల్మి ని ల్కడలేనిచెల్మి సంగరము వాఁడు కరివన్నెచాయ విన్కరిఁగన్నమాయ తొ ల్కరిఁగన్నుమూయ నెచ్చెరి కె వాఁడు కరమున్నరూపు సత్కరమున్నచూపు మొ క్కరమున్న బాపు చిక్కెఱుగు వాఁడు గీ|| మేలువాఁడు జగజ్జాల మేలువాఁడు నోమువాఁడు వరంబిచ్చు నోమువాఁడు వన్నెవాఁడు దలంప మువ్వన్నెవాఁడు యీశ్వరుం డగు శ్రీవేంకటేశ్వరుండు.
పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/33
ఈ పుటను అచ్చుదిద్దలేదు