ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

తిక్కన సోమయాజి


లేకపోయినను బహుస్థలములయం దన్వయ కాఠిన్యము గలదు. ఇందలికథ సంస్కృతములో నున్నంతలేక మిక్కిలి సంగ్రహపఱుపఁబడినది. శైలి పలుచోట్ల నారికేళపాక మనియే చెప్పవచ్చును. అందుచేతనే యీగ్రంథము భారతమువలె సర్వత్ర వ్యాపింప కున్నది. ఇతఁడు పదియాశ్వాసముల గ్రంథము వ్రాసినను పుస్తకమును మాత్రము ముగింప తేదు. రామనిర్యాణ కథను జెప్పుట కిష్టములేక గ్రంథపూర్తి చేయలేదని పెద్దలు చెప్పుదురు. తరువాతఁ గొంతకాలమునకు మిగిలిన భాగము నేకాశ్వాసముగా రచియించిన జయంతిరామభట్టు తిక్కనసోమయాజి మనుమరాజున కిచ్చినట్టుగా సరాంకితముచేయక తాను జేసిన కడపటి యాశ్వాసమును భద్రాద్రి రాముని కంకితము చేసెను."

నిర్వచనోత్తర రామాయణము పదవాక్యసౌష్టవము గలిగి మొత్తముమీఁద సరసముగానే యున్న దని యొప్పుకొనుచు నాంధ్రకవి చరిత్రకారుఁడు తిక్కనకృతభారత మంత రసవంతముగాను ప్రౌఢముగాను లేదనుటవింతగా నున్నది. దీనికిఁ గారణము బాల్యమునందు రచించుటయఁట. పదకాఠిన్యము లేదఁటగాని యన్వయకాఠిన్యము గలదఁట. ఇందలికథ సంస్కృతములో నున్నంతలేక మిక్కిలి సంగ్రహపఱుపఁబడుటయుఁ శైలి పలుచోట్ల నారికేళపాకముగా నుండుటయు నీగ్రంథము భారతమువలె సర్వత వ్యాపింప కుండుటకుఁ గారణములఁట. ఇదియంతయు భ్రాంతిమూలము. ఈ గ్రంథమును భారతముతోఁ బోల్ప సరికాదు. తిక్కన వ్రాసినయవతారిక వీరిభ్రాంతికిఁ గారణ మైనట్లు గన్పట్టుచున్నది. ఇది ప్రథమ కావ్వమగుటచేత తిక్కన పీఠికలోఁ బలుపోకలఁ బోయెనుగాని