ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి


హృదయ సీమలందు మహేశ్వరుడు మొదలగు దైవతములు నివసించు చున్నారో, వేద వేదాంగములు నివసించుచున్నవో ఎవరు మత సంరక్షణాభివృద్ధికై ఏర్పడినారో అట్టి బాహ్మణోత్తములకు నొకచక్కని గ్రామమును దానము చేయవలసినదిగా నా ప్రార్ధన మని వేడుకొనెయెనట, అప్పుడాతని కోరిక మన్నించి శా. శ. 1351 కీలక నామసంవత్సర మాఘమాసములో భాస్కర క్షేత్రమున హేమకూటమున నివసించు వీరూపాక్ష దేవుని సన్నిధిని పూగినాటి సీమలో గుండకమ్మనది యొడ్డున నుండు పోలసరమనుగ్రామమునకు చేజెర్ల యని పేరు పెట్టి బ్రాహ్మణులకు దానము చేసెనట.


రాజమహేంద్రపుర రాజ్యము

అల్లాడ భూపతీ.

కాటయ వేమభూపాలుఁడు స్వర్గస్థుడయిన పిమ్మట నతనిబంధ వుడు సైన్యాధ్యక్షుఁడు నగు అల్లాడ రెడ్డి రాజమహేంద్ర పుర రాజ్యము సౌక్రమించుకొని పరిపాలనము చేయనారంభించెను. ఇతఁడు క్రీ.శ.1416 మొదలుకొని 1426 సంవత్సరాంతము వఱకుఁ బరిపాలనము చేసెను. అల్లాడభూపతి రాజమహేంద్రపుర రాజ్యము పరిపాలనము చేయు నట్లు శ్రీనాథకవి విరచితములయిన భీమేశ్వర పురాణము, కాశీ ఖండమ వలననేగాక అల్లాడ వేమారెడ్డి శాసనమువలన సువ్యక్తమగుచున్నది కాటయవేమభూపాలుఁడు కాల ధర్మము నొందిన వెనుక బెడకోమటి వేమభూపాలుఁడు రాజమహేంద్రపుర రాజ్య మాక్రమించుటకై రాగా నల్లాడభూపతి రామేశ్వరముకడ వాని నెదుర్కొని యుద్ధము జేసి కోమటి వేముని సైన్యముల హతము గాగించి యోడించెననియు

సల్లాడ రెడ్డి శాసనమువలన స్పష్టమగుచున్నది.*[1] నిశ్శంక కొమ్మనామాత్మ

  1. * "తేషాం కనిష్ణోషి చ జన్మ నాభూత్" జ్యేష్ఠాగుంఐ — రల్లధరాతలేంద్ర కాక లేదు చంద్రోపదోషాకరతాముసేర స్యామ్యోపిభూవందనతా ముపన్న*