28
శ్రీ రా మా య ణ ము
పల్క గావలెఁగాక - పనిమాలినట్టి
పల్కు లేఁటికి మిమ్ముఁ - బనుచునే యితఁడు?
ఏఁబోయి కపుల నా - నృపకుమారకులఁ
దాఁబేటి పిల్లలఁ - దార్క్ష్యునిరీతిఁ 620
పాఱిపోవఁగనీక - పట్టుక మ్రింగి
యూరకవచ్చెద - నొక నిమేషమున!
కైదువ దాల్తునే - కపులపైనిపుడు!
పోదునే చేతులూ - పుచు వారికడకు
పనివిందు” నన నకం - పనుఁడు కోపించి
దనుజనాయకుతోఁ - దానిట్టులనియె.
-: అకంపనుని యనుచితోనిక్తులు :-
"మధుపానముల్ చేసి - మాంసముల్ మేసి
మధురాధరలఁగూడి - మసకంబులాడి
మీరుండవలెఁగాక - మీకేమి చింత?
పోరాడవచ్చిరే - పురుహూతముఖులు? 630
నరులఁట ! తోడువా - నరులఁట ! వారు
శరధి దాఁటుదురఁట ! - చాలదే బవిసి
ఇందుకు బుద్ధిని - యేమని మీర
లిందఱి నడుగఁగ - యింతేసి వారు
తాము వోవుదమన్న - తలవంపుగాదె
భూమిపై రక్కెస - పుట్టుల కెల్ల?
తనకునుత్తరువిండు - తన దళవాయిఁ
బనిచి వారల నెల్ల - బట్టి తెప్పింతు!