14
శ్రీ రా మా య ణ ము
లేచాయఁ బురముల - కెడ దూరములుగ
బలముల నడపించి - పల్లెలు నూళ్లు
చెలరేఁగి చిల్లర - సేయంగ నీక
కిముకనకుండు సు - గ్రీవాజ్ఞ యందు
సమకట్ట సహ్యాద్రి - చాయఁగాఁ గదలి
పోవ వాయుజ వాయు - పుత్రులమీద
రావణుఁ బొలియింప - రామలక్ష్మణులు 300
చనుచోట వలనైన - శకునముల్ చూచి
తనయన్నతో సుమి - త్రా పుత్రుఁడనియె.
-: దారిలో లక్ష్మణుఁడు శుభశకునములను గాంచుట :--
"దేవ ! ప్రకాశించి - దినకరబింబ
మీ వేళఁ దెల్లని - యెండలుగాసె !
జనకజాధిప! బృహ - స్పతిశుక్రు లిప్పు
డనుకూలులై నవా - రతిశుభ దృష్టి !
డాసి సప్తర్షి మం - డలమా ధ్రువునకుఁ
జేసె నిప్పుడు ప్రద - క్షిణ మాక సమున !
మనువంశ నృప ! నభో - మణి త్రిశంకుండు
తన పురోహితుఁడు నుఁ - దానుఁ జూపట్టె ! 310
నిరపద్రవద్యుతి - నీ వంశతార
పరగె విశాఖ శో - భన హేతువగుచు
నసురుల నక్షత్ర - మైన యా మూల
పసయెల్లఁ జెడి ధూమ - పాళితోఁ దగిలి
తారకాసురుని యు - దంబున దివిజ
వార మెంతయుఁ జెలు - వముఁ గాంచినట్ల