6
శ్రీ రా మా య ణ ము
యందు పైనైన నీ – యంబుధిదాఁటి
కదలిపోవుదము లం - కాగిరిదుర్గ
మది యెట్టులుండు ? సా - లావరు లెన్ని ?
ఎన్ని వాకిళులందు ? - నెంతంతమూఁక
యున్న దీపుర మెట్టు - లుండు ? రావణుని
కై జీతమెంత ? య - గడ్తలెట్టుండు ?
వాజివారణరథా - వళి యెంత కలదు ?
ఆకోట సవరణ - యదియెట్లు ? నగరి
వాకిట నడచు ప్ర - వర్తకం బేది ?
వివరింపు" మనరఘు - వీరునిఁ జూచి
పవమానతనయుఁడు - బలికె కేల్మోగిచి.
-: ఆ విశేషములను హనుమంతుఁడు రామున కెఱింగించుట :-
"దేవ ! లంక సా - ధించెద మనుచు
దేవాసురలకైన - ద్రిష్టింప రాదు !
చతురంగబలముల - సంఖ్యముల్ వాటి
మిత మింతయనఁగ నే - మిటి కెవ్వఁ డెఱుఁగు ?
నవరత్నఖచితమై - న సువర్ణ సాల
మవఘళించు విమాన - మార్గములకును !
ఆరసాతలమైన - యాకోటపరిఘ
నీరు నక్రగ్రాహ - నిబిడ మైయుండు !
ఆకోట దగుత్రికూ - టాచలాగ్రమున
నాకొండ కగడిత - యై వార్థియమరు