349
యుద్ధకాండము
యేకత్తిసాధన - నెప్పుడు నీవు
చేకని యుందువో - సేయుము దాన 7920
యెత్తిన కైదువు - నే నిన్నునెదిరి
పొత్తంబులకుఁ దగఁ - బొడిచి కూల్చెదను”
అనుమాటలకు మక - రాక్షునిఁ జూచి
జనకజారమణుఁ డెం - చక యిట్లు పలికి.
"రాక్షసాధమ ! మీ ఖ -రప్రముఖోగ్ర
రాక్షసు లెదిరించి - రణభూమిలోనఁ
బడినయట్ల మదీయ - బాణజాలములఁ
బడనేసి నీమేని - పలలజాలంబు
కాకగోమాయు కం - క వృకాదిజంతు
లేకమై భుజియింప - నిపుడె సేయుదును 7930
నాఁటి వాఁడనె యేను - నాఁటి బాణములె
నాఁటుచున్నవి నిన్ను - నాఁడు నేఁడగుచు"
-: శ్రీరామ మకరాక్షుల యుద్దము - శ్రీ రాముఁడాతనిఁ బొలియించుట :-
అను మాట విని మక - రాక్షుఁడత్యుగ్ర
కనకపుంఖశిలీము - ఖముల నేయుటయు
నమ్ములన్నియు తన - యమ్ములచేత
వమ్ముగా జానకీ - వరుఁడు మాఱేసి
జగడింప నురముచు - జలదముల్ రెండు
గగనవీధినిఁ బోరు - కై వడిఁ దోఁప
నీలనీరదకమ - నీయగాత్రుండు
నీలాచలోపమ - నిజశరీరుండు 7940